Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: మీరేమో ధోనిలాంటి లీడర్ నేనేమో కోహ్లీ ప్లేయర్.. చంద్రబాబు ఏమన్నారంటే

గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరయిన చంద్రబాబు.. ఈ సారి ముఖ్యమంత్రి హోదా బాలయ్య టాక్ షోకి వచ్చారు చంద్రబాబు. ఇక తొలి ఎపిసోడ్ కొద్దీ క్షణాల ముందే మొదలయ్యింది. ఈ టాక్ షోలో చంద్రబాబు, బాలయ్య మధ్య సరదా సంభాషణలు సాగుతున్నాయి.

Unstoppable with NBK: మీరేమో ధోనిలాంటి లీడర్ నేనేమో కోహ్లీ ప్లేయర్.. చంద్రబాబు ఏమన్నారంటే
Unstoppable With Nbk
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 26, 2024 | 4:49 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలయ్యింది. మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరయిన చంద్రబాబు.. ఈ సారి ముఖ్యమంత్రి హోదా బాలయ్య టాక్ షోకి వచ్చారు చంద్రబాబు. ఇక తొలి ఎపిసోడ్ కొద్దీ క్షణాల ముందే మొదలయ్యింది. ఈ టాక్ షోలో చంద్రబాబు, బాలయ్య మధ్య సరదా సంభాషణలు సాగుతున్నాయి. తన బావను తికమక పెట్టేలా బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు సంధిస్తున్నారు. దానికి తగ్గట్టుగా చంద్రబాబు చాలా సమయస్పూర్తితో సమాధానాలు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన డైలాగ్స్ తో మరోసారి ఆకట్టుకున్నారు. అలాగే ఆయన చంద్రబాబు గురించి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

ఇక బాలయ్య, బాబుగారి మధ్య చాలా సరదా సంభాషణలు సాగాయి. ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు అని బాలయ్య అన్నారు. ‘అన్‌స్టాపబుల్‌’ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించారు బాలయ్య. ‘మీ చమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది’ చంద్రబాబు డైలాగ్ కొట్టారు. ఆతర్వాత షోలో చంద్రబాబును బాలయ్య తన ఫ్యామిలీ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. మా చెల్లాయి మీకు ఒక రూ.500 ఇచ్చి కూరగాయలు తెమ్మంటే ఏం తెస్తారు అని బాలయ్య అడగ్గా ఆ డబ్బులను భద్రంగా దాచుకుంటా అని నవ్వులు పూయించారు బాబు. అలాగే మీ లైఫ్ లో షుగర్ ఎవరు అని బాలకృష్ణ అడగ్గా మీ లైఫ్ లో చాలా షుగర్స్ ఉంటాయి.. నాకు ఒక్కటే షుగర్ అని సరదాగా అన్నారు చంద్రబాబు.

ఇది కూడా చదవండి :వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

ఆతర్వాత స్క్రీన్ పై కొన్ని ఫోటోలను చూపించి వాటి గురించి అడిగారు బాలయ్య. దాంతో ఒక పక్క ధోని, మరో పక్క కోహ్లీ ఫోటోలు ఉంచి బావ మీరేమో ధోని లాంటి లీడర్ నేనేమో కోహ్లీ ప్లేయర్ అని బాలయ్య ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం అని అడగ్గా.. దానికి చంద్రబాబు.. నేను ఎప్పుడు విరాట్ కోహ్లీని ప్రిఫర్ చేస్తాను అని అన్నారు. దాంతో షోలో ఆడియన్స్ చప్పట్ల వర్షం కురిపించారు. ఆతర్వాత బాలకృష్ణ నేనేమో.. మాస్ హీరోను.. మీరేమో మాస్ లీడర్ అని అనగానే బోత్  ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పారు చంద్రబాబు. దాంతో ఒక్కసారిగా షోలో చప్పట్లు, ఈలలతో గోలగోలగా మారిపోయింది.

ఇది కూడా చదవండి : Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.