వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

థియేటర్స్‌లో మిస్ అయిన వారు.. లేదా సినిమా బాగా నచ్చి మళ్లీ మళ్లీ చూడాలని అనుకునేవారు ఓటీటీలో సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతున్నాయి

వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..
Horror Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2024 | 9:35 PM

ఓటీటీ లో వచ్చే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్‌లో మిస్ అయిన వారు.. లేదా సినిమా బాగా నచ్చి మళ్లీ మళ్లీ చూడాలని అనుకునేవారు ఓటీటీలో సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీల్లో ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, సస్పెన్స్, హారర్, రొమాంటిక్ సినిమాలే ఎక్కువ.. డైరెక్టర్స్ కూడా ఇలాంటి సినిమాల్లో ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడం బెటర్.

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

ఓటీటీల్లో ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల్లో బెస్ట్ హారర్ మూవీ ఇది. ఈ సినిమాలో ఓ యువతి క్షుద్రపూజలు , కొన్ని అనుకోని శక్తుల కారణంగా.. వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే హత్యలు కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది.ఆమె పై క్షుద్రపూజలు చేసింది ఎవరు. దీనితో ఈ హత్యల వెనుక దాగి ఉన్న నిజ నిజాలను ఛేదించేందుకు..  ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అయితే అతను ఆ హత్యల గురించి తెలుసుకునే క్రమంలో షాకింగ్ విషయాలు బయట పడుతూ ఉంటాయి. ఊహించని ట్విస్ట్ లు, భయంకర సన్నివేశాలు ఎదురవుతాయి.

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

అసలు అతను ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు.? అసలుఆ అమ్మాయి లోపల ఉన్న ఆత్మ ఎవరిదీ.? ఎందుకు హత్యలు చేస్తుంది.  ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు.. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమా పేరు ది అకాలి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమిళ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో నాజర్ కీలకపాత్రలో నటించారు. ఈ హారర్ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. సీన్ సీన్ కు సుస్సు పడిపోద్ది మీ ఇష్టం..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.