Swag Movie: ఓటీటీలోకి వచ్చేసిన స్వాగ్ మూవీ.. శ్రీవిష్ము కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తెలుగులో విభిన్నమైన సినిమాలు, పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. చిన్న చిన్న సినిమాలతోనే తెలుగు సినీరంగంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్వాగ్ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

Swag Movie: ఓటీటీలోకి వచ్చేసిన స్వాగ్ మూవీ.. శ్రీవిష్ము కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Swag Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 25, 2024 | 10:56 AM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ స్వాగ్. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన ఇరవై రోజుల వ్యవధిలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రీతూ వర్మ, శ్రీవిష్ణు హీరోహీరోయిన్లుగా నటించగా.. మీరాజాస్మిన్, దక్షా నగార్కర్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ మూవీలో శ్రీవిష్ణు ఏకంగా ఐదు పాత్రలలో కనిపించారు. అలాగే హీరోయిన్స్ రీతూ వర్మ, మీరా జాస్మిన్ డ్యూయల్ రోల్స్ చేశారు.

అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈసినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. శ్రీవిష్ణుతోపాటు రీతూ వర్మ నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎనిమిది కోట్ల వరకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ లో ఏడు కోట్ల వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది. ఓటీటీ, శాటిలైట్ డీల్ తో ప్రొడ్యూసర్స్ సేఫ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.

కథ విషయానికి వస్తే… భవభూతి (శ్రీవిష్ణు) పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంటాడు. గొడవల కారణంగా భార్య రేవతి (మీరా జాస్మిన్) అతడికి దూరంగా వెళ్లిపోతుంది. శ్వాగణిక వంశ వారసత్వానికి సంబంధించి భవభూతి ఓ లెటర్ వస్తుంది. కోట్ల రూపాయాల ఆస్తి కోసం వంశ వృక్ష నిలయానికి తన భర్తతోపాటు అలాంటి ఉత్తరాలతోనే సింగ (శ్రీవిష్ణు), అనుభూతి (రీతూ వర్మ) కూడా వస్తారు. వారికి లేఖలు పంపించిన విభూతి (శ్రీవిష్ణు) ఎవరు ? అసలు ఆ ముగ్గురికి వంశ వృక్ష నిలయానికి ఉన్న సంబంధమేంటీ. ? చివరకు ఆస్తి ఎవరికి వచ్చింది అనేది సినిమా.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.