OTT Movies: ఈ హార్రర్ షోస్ చూసిన వారికి అస్సలు నిద్రపట్టదు.. వణుకుపుట్టించే మైండ్ బ్లోయింగ్ మూవీస్ ఇవే..

హారర్ సినిమాలు, థ్రిల్లర్ మిస్టరీస్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు కోన్ని హార్రర్ కంటెంట్ షోస్ తీసుకువచ్చాము. ఆద్యంతం వణుకు పుట్టించే సీన్స్, ఊహించని ట్విస్టులతో జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా..

OTT Movies: ఈ హార్రర్ షోస్ చూసిన వారికి అస్సలు నిద్రపట్టదు.. వణుకుపుట్టించే మైండ్ బ్లోయింగ్ మూవీస్ ఇవే..
Horror Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 25, 2024 | 11:30 AM

వీకెండ్ వచ్చేసిందంటే చాలు సినీ ప్రియులకు పండగే. అటు థియేటర్లో వరుస మూవీస్.. ఇటు ఓటీటీల్లో సరికొత్త కంటెంట్ చిత్రాలు వచ్చేస్తుంటారు. శుక్రవారం ఏఏ సినిమాలు విడుదలవుతాయంటూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగు, తమిళంలో అనేక సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. కానీ హార్రర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆహా, జియో సినిమా, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్స్ లో కొన్ని హారర్ మూవీస్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని చిత్రాలు చూస్తే రాత్రిళ్లు మీకు అస్సలు నిద్రపట్టదు. భయంతో వణికిపోవాల్సిందే. ఇంతకీ ఆ హారర్ కంటెంట్ చిత్రాలు ఏంటో చూద్దామా.

ది డార్క్ స్క్రోల్ డార్క్ స్క్రోల్ అనేది రియాలిటీ షో. ఈ రియాలిటీ షో MTVలో ప్రసారమైంది. 9 మంది పోటీదారులు ఉంటారు. పోటీదారులు ఉత్తరాఖండ్‌లోని కొన్ని భయానక ప్రదేశాలను సందర్శిస్తారు. అక్కడ వచ్చిన అడ్డంకులను ఎలా తప్పించుకుంటారు అనేది సినిమా. ఈ రియాల్టీ షో ప్రత్యేకత ఏంటంటే హాంటెడ్ ప్రదేశంలో ఒక రాత్రి ఎలా గడపాలి ? అనేది.

అమెరికన్ హర్రర్ స్టోరీ..

అమెరికన్ హర్రర్ స్టోరీ చాలా సీజన్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఇందులో 12 సీజన్స్ వచ్చాయి. ఈసారి మాత్రం కొత్త పాత్రలు, విభిన్న హారర్ థీమ్ తో వస్తున్నాయి. అమెరికన్ హారర్ స్టోరీ సీజన్ 8, అపోకలిప్స్ షో సీజన్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘అమెరికన్ హారర్ స్టోరీ’ అద్భుతంగా తెరకెక్కించారు. ఇది హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

నుండి (from)

ఇది జాన్ గ్రిఫిన్ రూపొందించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ TV సిరీస్. మొదటి సీజన్ ఫిబ్రవరి 20, 2022న Epixలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ధారావాహికలో హెరాల్డ్ పెరినో, కాటాలినా శాండినో మోరెనో, ఇయాన్ బెయిలీ, డేవిడ్ ఆల్ప్, ఎలిజబెత్ సాండర్స్, స్కాట్ మెక్‌కార్డ్, రికీ హీ నటించారు. ఈ టీవీ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.

ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్..

మైక్ ఫ్లానాగన్ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ మినిసిరీస్ ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్..ఇది నెట్‌ఫ్లిక్స్ కోసం అంబలిన్ టెలివిజన్, పారామౌంట్ టెలివిజన్ ద్వారా నిర్మించారు. దీనిని 1959లో అదే పేరుతో షిర్లీ జాక్సన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. మైఖేల్ హుయిస్మాన్, ఎలిజబెత్ రీజర్, ఆలివర్ జాక్సన్-కోహెన్, కేట్ సీగెల్, విక్టోరియా పెడ్రెట్టి నటించారు. సైకలాజికల్ హారర్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

డెబోరా లోగాన్ టేకింగ్..

జిల్ లార్సన్, అన్నే రామ్‌సే, మిచెల్ ఆంగ్ నటించిన ఈ చిత్రం అల్జీమర్స్ వ్యాధి చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.