Unstoppable with NBK 4: బాలయ్య పండక్కి సెలవు కావాలి.. ఏంది మావా ఈ బజ్
కొంచెం నీరు, కొంచెం నిప్పు.. కేరాఫ్ అన్‌స్టాపబుల్.. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో ఆహా వేదిగా స్ట్రీమ్ అవ్వబోతుంది. ఒక మాస్ హీరో.. ఒక మాస్ లీడర్‌తో తలపడితే.. అదే బాబు బాలయ్యల కాంబినేషన్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఒకప్పుడు బెజవాడలో కాలేజీలకు అప్రకటిత హాలిడేస్ నడిచేవి. అక్కడ బాలయ్య ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది మరీ. ఆయన ఫ్యాన్స్ ఇప్పుడూ వివిధ నగరాల్లో ఐటీ ఎంప్లాయిస్‌గా రాణిస్తున్నారు. ప్రజంట్ కెరీర్ పీక్‌లో ఉన్న బాలయ్య వివిధ రంగాల్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. కాగా బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటల నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే.. ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4లో సీఎం చంద్రబాబుతో బాలకృష్ణ సందడి చేయబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమో.. నెట్టింట ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతోంది. చంద్రబాబు ఈ ప్రోగ్రామ్‌కి హాజరుకావడం ఇది రెండోసారి. గతంలో ప్రతిపక్ష నేతగా.. ఇప్పుడు అధికారపక్షంలో ఉంటూ అటెండ్ అయ్యారు. ఆ ఎపిసోడ్.. లేటెస్ట్ ఎపిసోడ్.. అప్పుడు.. ఇప్పుడు.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ క్లియర్ కట్‌గా క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో ఈ షోపై భారీ బజ్ ఏర్పడింది.
ఈ క్రమంలో అన్‌స్టాపబుల్ సీజన్ 4ను.. బాలయ్య పండగా వర్ణిస్తున్నారు ఆయన అభిమానులు. అంతేనా.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ కానున్న శుక్రవారం రోజున సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైటెక్ సిటీ రోడ్లుపై కొందరు ఐటీ ఉద్యోగులు ప్లకార్డులతో హల్‌చల్ చేశారు. బాలయ్య పండుగ 25న హాలిడే కావాలి అని ప్లకార్డులపై రాసి ఉంది. ఈ క్రేజ్ అంతా చూస్తుంటే.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 అన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తుంది.
Hyderabad employees have taken innovation to the next level by requesting a holiday for the much-awaited premiere of #UnstoppableWithNBK Season 4! 🎉
All set to watch Episode 1 only on @ahavideoin OTT on Oct 25th, 8.30PM 💥#balayyapanduga #NandamuriBalakrishna… pic.twitter.com/kzTTyI0zDV
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 24, 2024
రాజకీయాలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, భావోద్వేగాలు, చేదు జ్ఞాపకాలు, కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఇలా అన్నీ కలిపిన ఎపిసోడ్‌లా కనిపిస్తోంది అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్. ప్రొమోలో ఫైనల్‌గా బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న చంద్రబాబు డైలాగ్‌తో .. ఈ ఎపిసోడ్‌పై అంచనాలు అంతకుమించి అనేలా పెరిగిపోయాయి. అక్టోబర్ 25న ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కోసం తెలుగురాష్ట్రాల ప్రజలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.