AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మసూద మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ
Masooda Movie
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2024 | 10:34 PM

Share

హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోకి బెస్ట్ మూవీగా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో మసూద సినిమా ఒకటి. 2022లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హార‌ర్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంగీత‌, తిరువీర్‌, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లుపోషించారు.  ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న మసూద ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

కాగా ఈసినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన నటి గుర్తుందా.? మసూద సినిమాలో సంగీత కూతురుగా నటించింది ఆమె.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన యువతిగా నటించి ఆకట్టుకుంది. ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఆమె పేరు బాంధవి శ్రీధర్. ఈ చిన్నది మసూద సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ అమ్మడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.. బాంధవి శ్రీధర్ మిస్ ఇండియా రన్నరప్ 2019‌గా నిలిచింది. అంతేకాదు మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఇక ఈ చిన్నది మసూద సినిమాతో పాటు మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాంధవి శ్రీధర్ రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడికి నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పుడెప్పుడు ఫోటోలు షేర్ చేస్తుందా అని చూసే కుర్రాళ్ళు చాలామందే ఉన్నారు. అందం అభినయం ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ గా బిజీ కాలేకపోతోంది. ఇక పై ఈ బ్యూటీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..