Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ .. దిమ్మ తిరిగే ట్విస్టులతో మైండ్ బ్లాక్

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (అక్టోబర్ 25) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. లవ్, క్రైమ్ ,సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్ల కు చెందిన సినిమాలు వివిధ ఓటీటీల్లో ప్రత్యక్షం కానున్నాయి. అయితే ఓటీటీ ఆడియెన్స్ దృష్టి మాత్రం సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి ఉంది. అలాంటి వారికోసమే ఈ సినిమా..

OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ .. దిమ్మ తిరిగే ట్విస్టులతో మైండ్ బ్లాక్
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2024 | 8:48 PM

బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని. గతంలో ఎక్కువగా డిఫరెంట్ కథలతో సినిమాలు తీసిన అతను ఈ మధ్యన ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అలా విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం హిట్లర్. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ మూవీ రిలీజైంది. అయితే ఎన్టీఆర్ దేవర బరిలో ఉండడంతో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయలేదు. తమిళంలోనూ ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అయతే కథ, కథనాలు, టేకింగ్ పరంగా విజయ్ ఆంటోని సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో హిట్లర్ సినిమా ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. హిట్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుంచి విజయ్ ఆంటోని సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అలాగే హిట్లర్ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా పంచుకుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే హిట్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. ఈ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ వాసుదేవమీనన్‌, చరణ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

హిట్లర్ సినిమాకు ధన దర్శకత్వం వహించారు. ఈయన మరెవరో కాదు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు ప్రియ శిష్యుడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మినిస్టర్ మైఖేల్ కు చెందిన మనుషులు ఒక్కొక్కరు దారుణ హత్యకు గురవుతుంటారు. అలాగే మినిస్టర్‌కు చెందిన కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఓ అపరిచిత వ్యక్తి అత్యంత చాక చక్యంతో అపహరించుకుపోతాడు. మరి మినిస్టర్ పై పగ బట్టిన ఆ వ్యక్తి ఎవరు?ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసారు అన్నది హిట్లర్ సినిమా స్టోరీ. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు బాగా చూసే వారికి హిట్లర్ కూడా ఒక టైమ్ పాస్ మూవీగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు రానున్న హిట్లర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.