AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: అరెరె.. ఎవరీ అమ్మాయి.. అచ్చం ఐశ్వర్యా రాయ్‌లా ఉందే.. షాక్‌లో నెటిజన్స్

బాలీవుడ్ అందాల తార, నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ ను పోలిన అమ్మాయిలు వైరల్ కావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా అచ్చం ఐశ్వర్య లాగానే కనిపించి ఫేమస్ అయ్యింది. అలాగే నటి అంజలి శివరామన్ కూడా అచ్చం ఐష్ లాగే కనిపిస్తుంటుంది.

Aishwarya Rai: అరెరె.. ఎవరీ అమ్మాయి.. అచ్చం ఐశ్వర్యా రాయ్‌లా ఉందే.. షాక్‌లో నెటిజన్స్
Kanwal Cheema, Aishwarya Ra
Basha Shek
|

Updated on: Oct 25, 2024 | 9:52 PM

Share

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఐశ్వర్యారాయ్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందం, గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోయిన్లు కూడా ఐష్ అందం ముందు దిగదుడుపే. గతంలో వేగంగా సినిమాలు చేసిన ఐశ్వర్య అభిషేక్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. ఈ మధ్య ఐశ్వర్య, అభిషేక్ ల విడాకుల వార్తలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇక సినిమాలు బాగా తగ్గించేసిన ఐష్ ఈ మధ్యన సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటోంది. అయితే అచ్చం ఆమె లాగే కనిపించే ఒక పాకిస్తాన్ అమ్మాయి ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఐశ్వర్యారాయ్ లాగే ముక్కు, అందమైన నీలి కళ్ళు ఉండడంతో నెటిజన్లు ఆమె ఫొటోలను ఐశ్వర్యారాయ్ ఫోటోలతో పోల్చినెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐష్ డోపెల్ గ్యాంగర్ లా నెట్టింట సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కన్వాల్ సీమా. పేదల గురించి మాట్లాడే వేదికగా, వారికి సహాయం చేసే ‘మై ఇంపాక్ట్ మీటర్’ అనే డిజిటల్ కంపెనీని నిర్వహిస్తోంది సీమా. ఇటీవల పలు న్యూస్ ఛానెల్స్ ఇంటర్యూల్లోనూ పాల్గొన్న ఆమె ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

న్వాల్ సీమా స్కూల్ చదువు మాత్రమే పాకిస్తాన్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ లలో ఉన్నత చదువులు అభ్యసించింది. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో 200 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకుని స్వదేశానికి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ లో తన స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తోంది. కాగా తనని ఐశ్వర్యారాయ్ తో పోల్చడం, ఐష్ డూప్లికేట్ అని నెటిజన్లు చేయడంపై కన్వాల్ సీమా స్పందించింది. ‘నన్ను ఐశ్వర్యా రాయ్ డూప్లికేట్ అని చెప్పడం నచ్చలేదు. నా ఐడెంటిటీ నాకు ఉంది’ అంటూ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

కన్వాల్ సీమా లేటెస్ట్ ఫొటోస్..

కాగా గతంలో ‘సుహానీ అహుజా’ వెబ్ సిరీస్ లో నటించిన అంజలి శివరామన్ కూడా ఐశ్వర్యారాయ్ లా కనిపించడంతో ఫేమస్ అయ్యింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా అచ్చం ఐష్ లాగానే కనిపించి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరి బాటలో కన్వాల్ సీమా కూడా అలాగే ఫేమస్ అవుతోంది.

కన్వాల్ సీమా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ఈ జ్యూస్ తో
10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ఈ జ్యూస్ తో
వాహనాల దొంగలకు చెక్‌.. ఫొటో తీస్తే చోరీ బండి పట్టుబడినట్టే!
వాహనాల దొంగలకు చెక్‌.. ఫొటో తీస్తే చోరీ బండి పట్టుబడినట్టే!
రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..
మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..
బీరకాయ తొక్కను పారేయకండి! ఇలా పచ్చడి చేసి తిన్నారంటే ఆరోగ్యానికి
బీరకాయ తొక్కను పారేయకండి! ఇలా పచ్చడి చేసి తిన్నారంటే ఆరోగ్యానికి
వరంగల్ ఎయిర్ పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?
వరంగల్ ఎయిర్ పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?
చీకట్లోనూ రంగుల వీడియో! రూ.5,100కే Xiaomi కొత్త స్మార్ట్ కెమెరా
చీకట్లోనూ రంగుల వీడియో! రూ.5,100కే Xiaomi కొత్త స్మార్ట్ కెమెరా
దీర్ఘకాలిక మైగ్రేన్ నివారణకు అద్భుతమైన మూలికా పానీయం..తాగితే మాయం
దీర్ఘకాలిక మైగ్రేన్ నివారణకు అద్భుతమైన మూలికా పానీయం..తాగితే మాయం
వార్మప్‌ మ్యాచ్‌లో ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్
వార్మప్‌ మ్యాచ్‌లో ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్
ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి మునగాకు-ఉసిరి జ్యూస్ తాగితే
ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి మునగాకు-ఉసిరి జ్యూస్ తాగితే