AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: ఇంటికెళ్లగానే భార్య, పిల్లలను పట్టుకుని బోరున ఏడ్చేసిన జానీ మాస్టర్.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి గత నెల 19న జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొదట రంగారెడ్డి పోక్సో న్యాయస్థానంలో బెయిల్‌ కోసం ఆయన ప్రయత్నించగా అనుమతి లభించలేదు. మరో పిటిషన్‌ వేయడంతో మాస్టర్ కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Jani Master: ఇంటికెళ్లగానే భార్య, పిల్లలను పట్టుకుని బోరున ఏడ్చేసిన జానీ మాస్టర్.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
Jani Master
Basha Shek
|

Updated on: Oct 26, 2024 | 9:13 PM

Share

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్ట‌ర్ జైలు నుంచి రిలీజయ్యాడు. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం (అక్టోబర్ 25) చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి బయటకు వచ్చాడు జానీ మాస్టర్. కాగా జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా ఇంటికెళ్లిపోయాడు జానీ. అక్కడ తన భార్య, పిల్లలను కలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక జానీ మాస్టర్‌ను చూడగానే ఆయన పిల్లలు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తండ్రిని గట్టిగా హత్తుకున్నారు. జానీ మాస్టర్ కూడా తన పిల్లల్ని పట్టుకొని ముద్దులు పెడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్యను కూడా పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేశాడు జానీ మాస్టర్. ‘ఈ 37 రోజుల్లో మా నుంచి చాలా లాగేసుకున్నారు. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను ఈరోజు ఇక్కడికి చేర్చాయి. నిజాన్ని కొద్ది రోజులు మాత్రమే దాచి పెట్టగలరు.. కానీ ఏదో ఒక రోజు ఆ నిజం అందరికీ తెలిసిపోతుంది. కానీ ఈ క్లిష్ట సమయంలో నా ఫ్యామిలీ అనుభవించిన మనో వేదన, కష్టం ఎప్పటికీ నా గుండెను ముక్కలు చేస్తూనే ఉంటుంది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చాడు జానీ మాస్టర్.

ప్రస్తుతం జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు జానీకి ధైర్యం చెబుతున్నారు. ఏదో ఒక రోజు నిజం బయటికొస్తుందంటూ మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. కాగా పోక్సో చట్టం కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదవడంతో అతనికి ప్రకటించిన జాతీయ అవార్డును నిలిపివేశారు. అలాగే పుష్ఫ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉండగా జానీ స్థానంలో వేరొక కొరియోగ్రాఫర్ ను తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాలనే ఇన్ డైరెక్టుగా తన పోస్ట్ లో మెన్షన్ చేశాడు జానీ మాస్టర్.

ఇవి కూడా చదవండి

భార్యా, పిల్లలతో జానీ మాస్టర్.. ఎమోషనల్ వీడియో

బెయిల్ తర్వాత జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..