Renu Desai: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన రేణు దేశాయ్.. హ్యాట్సాఫ్ చెబుతోన్న అభిమానులు, నెటిజన్లు

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో రేణూ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఈ సినిమా రిలీజై కూడా ఏడాది గడిచింది.

Renu Desai: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన రేణు దేశాయ్.. హ్యాట్సాఫ్ చెబుతోన్న అభిమానులు, నెటిజన్లు
Actrss Renu Desai
Follow us
Basha Shek

|

Updated on: Oct 26, 2024 | 7:54 PM

టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మూగ జీవాలు, అనాథ పిల్లలకు తన వంతూ సాయం చేస్తున్నారు. అదే సమయంలో తన ఫాలోవర్స్‌ని కూడా విరాళం ఇవ్వామని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ‘ఈ రోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. నేను ఎన్నో ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షించడం నాకు ఇష్టం. ఎన్నో సార్లు నా వంతు ప్రయత్నం చేశాను. మూగ జీవాల కోసం నా గళాన్ని వినిపించాలని.. వాటి రక్షణ కోసం ఇంకా ఏదైనా మంచి పనులు చేయాలని కొవిడ్ సమయంలో గట్టిగా అనుకున్నాను. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించాను. ఇన్నాళ్లకు నా సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించాను. ఇందుకోసం అన్నీ నా ప్యాకెట్ ‌లోంచే ఖర్చు పెడతాను. నా సొంతంగా అంబులెన్స్, బ్యాంక్ అకౌంట్‌ను సంపాదించాను. నన్ను నమ్మి నా కొత్త జర్నీకి అందరూ సపోర్ట్ చేయండి’

‘ఇక నా కూతురి పేరు మీద ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ పేరుతో ఇన్‌స్టాలో ఒక కొత్త అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. అందరూ ఈ పేజ్‌ను ఫాలో అవండి. అయితే అందరికీ నేనొక రిక్వెస్ట్ చేస్తున్నాను. రూ. 500 అయినా సరే విరాళం చేయండి. . నెలకు కనీసం రూ. 100 అయిన డొనేట్ చేయండి. మీరు చేసే చిన్న సహాయం నాకు అతి పెద్ద హెల్ప్ అవుతుంది. మీరు ఇచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. నేను నా సొంత డబ్బులతో ఆస్పత్రి కట్టిస్తాను. కానీ అందుకు కొంత సమయం పడుతుంది’ అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూగ జీవాల కోసం చాలా మంచి పనులు చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.