Brahmamudi, October 27th Episode: కావ్య ఇచ్చిన షాక్‌కి దిగొచ్చిన క్లయింట్స్.. ఆఫీస్‌కి రాజ్..!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ కూరగాయలను ఒంటినిండా వేసుకుని మోసుకొస్తాడు. రాజ్‌ని చూసి రుద్రాణి షాక్ అవుతుంది. చూశావా నాన్నమ్మా ఎలాంటి పుచ్చులు.. చచ్చులు లేకుండా అన్నీ మంచివే తీసుకొచ్చానని చెప్తాడు రాజ్. రేయ్ నీ వెంట మేకలు, గేదెలు వెంటపడలేదా అని ప్రకాశం అడిగితే.. అందుకే తెలివిగా ఆలోచించి పాట పాడుకుంటూ వచ్చాను. దీంతో అవి భయపడి వెనక్కి వెళ్లిపోయాయని అంటాడు రాజ్. అమ్మో అమ్మో కంపెనీ సిఈవో అయి ఉండి.. ఇంటి నౌకరిలాగ ఈ కూరగాయలు తేవడం ఏంటి? నాకే అదోలా ఉంది..

Brahmamudi, October 27th Episode: కావ్య ఇచ్చిన షాక్‌కి దిగొచ్చిన క్లయింట్స్.. ఆఫీస్‌కి రాజ్..!
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us

|

Updated on: Oct 28, 2024 | 1:06 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ కూరగాయలను ఒంటినిండా వేసుకుని మోసుకొస్తాడు. రాజ్‌ని చూసి రుద్రాణి షాక్ అవుతుంది. చూశావా నాన్నమ్మా ఎలాంటి పుచ్చులు.. చచ్చులు లేకుండా అన్నీ మంచివే తీసుకొచ్చానని చెప్తాడు రాజ్. రేయ్ నీ వెంట మేకలు, గేదెలు వెంటపడలేదా అని ప్రకాశం అడిగితే.. అందుకే తెలివిగా ఆలోచించి పాట పాడుకుంటూ వచ్చాను. దీంతో అవి భయపడి వెనక్కి వెళ్లిపోయాయని అంటాడు రాజ్. అమ్మో అమ్మో కంపెనీ సిఈవో అయి ఉండి.. ఇంటి నౌకరిలాగ ఈ కూరగాయలు తేవడం ఏంటి? నాకే అదోలా ఉంది.. మరి నీకేం ఇబ్బంది అనిపించలేదా? అని రుద్రాణి అడిగితే.. ఎందుకు అత్తా ఇబ్బంది. కన్న తల్లికి.. కన్న తండ్రికి.. నాన్నమ్మకు.. తాతయ్యలకు లేని ఇబ్బంది నాకు మాత్రం ఎందుకు? అని అంటాడు. ఎందుకు నువ్వు ఈ పనులు చేస్తున్నావో నాకు బాగా తెలుసని అపర్ణ అంటే.. నాతో ఈ పనులు ఎందుకు చేయిస్తున్నారో నాకు కూడా తెలుసుకు మమ్మీ అని రాజ్ అంటాడు.

రాజ్‌పై రుద్రాణి ప్రేమ..

ఇప్పుడు ఏంటి? కావ్యని ఆ పోస్ట్ నుంచి తీసేసి.. నీ స్థానంలో నిన్ను కూర్చోబెడితే తప్ప నువ్వు ఆఫీస్‌కి వెళ్లవా? అని అపర్ణ అడుగుతుంది. మీరేంటి? నన్ను మేనేజర్ పోస్టులో పడేసి.. వెళ్లనంటే ఇలాంటి ఇంటి చాకిరీ చేయిస్తారా? అని రాజ్ అడుగుతాడు. బాగా అర్థమైందిరా నీకు నా చిట్టి కన్నా ఇందిరా దేవి అంటుంది. ఇప్పుడు చెబుతున్నా వినండి.. ఆ కళావతి కోసం నన్ను దివాలా చేయాలని చూస్తున్నారు. ఆ కంపెనీ దివాలా తీసినా.. ఎంత నష్టం వచ్చినా.. నాకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ అంటాడు. ఇంత బ్రతుకు బ్రతికి.. అలాంటి అనామకురాలి కింద పని చేయడం ఏంటి? కరెక్ట్.. నాన్సెన్స్ అని రుద్రాణి అంటుంది. గుడ్ రా నాన్నా.. అని ప్రకాశం కార్ వాష్ చేయించమని రాజ్‌కి చెప్తాడు. వెళ్లు సిటీ బస్సులో వెళ్లిరమ్మని అపర్ణ అంటే.. పనీ పాట ఏమీ లేదు కదా నాన్న వెళ్లు అని ప్రకాశం అంటుంది. సిటీ బస్సులో అయినా వెళ్తాను.. లేదంటే షేర్ ఆటో ఎక్కి అయినా వెళ్తాను కానీ.. మీ మాటలకు మాత్రం నలిగి పోనని రాజ్ వెళ్తాడు.

కళ్యాణ్‌కు అమ్మ ప్రేమ పరిచయం చేసిన అప్పూ..

మరోవైపు కళ్యాణ్ పాటలు రాస్తూ చించేస్తూ ఉంటాడు. ఏంటి కూచీ ఇదంతా.. పాత సినిమాల్లో హీరోలు లవ్ లెటర్ రాయడానికి పడిన కష్టంలా ఉంది. అమ్మ మీద పాట రాయాలంట. కానీ నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మన విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు గుర్తుకు వస్తుంది. అందుకే పాట రాయలేక పోతున్నానని కళ్యాణ్ అంటాడు. ప్రేమ అంటే అదే కదా.. మీ అమ్మ నుంచి నేను ఎక్కడ వేరు చేస్తానేమో అని కంగారు పడుతుంది. మరి అదే కదా ప్రేమ. అలాగే ఆలోచించి రాయి. ముందు నువ్వు తిని.. బాగా ఆలోచించి పాట రాయి. నువ్వు రాసే పాటకు ఆ లిరిక్ లక్ష్మీ గాడు ఫిదా అయిపోవాలని అప్పూ అంటుంది. మరోవైపు రుద్రాణి హాల్‌లో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి విలక్షణ నటి ఏంటి ఆలోచిస్తున్నావ్ అని పెద్దావిడ అడిగితే.. మీరు చేస్తుంది చాలా అన్యాయం అమ్మా.. ఈ కూరగాయలు, తైలాలు తేవడం ఏంటి? అని అంటుంది. అబ్బా నీకు బాధగా ఉందా? వాడు సిటీ బస్సులో వెళ్లడం ఏంటి? సరే ఒక పని చేయి.. వాడి బదులు నువ్వు వెళ్లు అని ఇందిరా దేవి అడిగితే.. ఎందుకులే అమ్మా వాడు చూసుకుంటాడులే.. ప్రేమ ఉంది కానీ.. ఇవన్నీ వద్దని రుద్రాణి అంటే.. అర్థమైంది కదా నోరు మూసుకుని వెళ్లమని ఇందిరా దేవి అంటుంది.

ఇవి కూడా చదవండి

ఫ్యాన్ రిపేర్ చేసిన రాజ్..

ఆ తర్వాత రాజ్ వచ్చి తైలం.. పెద్దావిడకు ఇస్తాడు. బాబాయ్ అని పిలుస్తూ కారు తాళం ఇస్తాడు. ఆ నెక్ట్స్ పాడైపోయిన ఫ్యాన్ తీసుకొచ్చి బాగు చేయమని చెప్తాడు ప్రకాశం. ఫ్యాన్ నువ్వే రిపేర్ చేయిస్తావో.. బయట ఇస్తావో నీ ఇష్టం. నేను చాలా బిజీ.. నేను ఖాళీగా లేనని ప్రకాశం అంటాడు. దీంతో ఫ్యాన్ నేనే రిపేర్ చేస్తానని.. బాగు చేస్తాడు రాజ్. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇదిగో ఫ్యాన్ అయిపోయింది.. ఆన్ చేసి చెక్ చేసుకోమని రాజ్ అంటే.. ఫ్యాన్ మంచిగా తిరుగుతుంది. సరే ఇంకేమైనా పనులు ఉంటే పైన నా గదిలో ఉంటాను చెప్పమని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఆఫీసికి క్లయింట్స్ వస్తారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి కొత్తగా అపాయింట్మెంట్ అయిన మీకు కంగ్రాట్స్ చెప్తారు. అందేంటి? ఫోన్ చేసి రమ్మంటే రానని చెప్పారని శ్రుతి అంటుంది. మేడమ్ పద్దతిగా చెప్పారు అందుకే వచ్చామని క్లయింట్స్ అంటారు. థాంక్యూ సర్ మీరు మీటింగ్ హాల్‌లో కూర్చోండి నేను వచ్చి జాయిన్ అవుతానని కావ్య అంటుంది. అదేంటి మేడమ్ అని శ్రుతి అడిగితే.. అనామిక ప్లాన్ ఫాలో చేసినట్టు చెబుతుంది కావ్య.

సుభాష్‌ని క్షమించని అపర్ణ..

ఆ తర్వాత అపర్ణ ఆలోచనలో ఉంటుంది. సుభాష్ వచ్చి ఏంటి అపర్ణా.. వాడికి ఎన్ని పనులు చెప్పినా చేస్తున్నాడు కానీ ఆఫీస్‌కి వెళ్లడం లేదని అనుకుంటున్నారా.. మీ ప్రయత్నంలో నిజం ఉంది.. కాబట్టి మీరు అనుకున్నది తప్పకుండా నిజం అవుతుందని చేతిలో చేయి వేయబోతే అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలాంటి నాలుగు మాటలు చెప్పి నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నారా? ఇలాంటి మాటలే చెప్పి నన్ను మోసం చేశారు.. మరో సారి నేను మోస పోవడానికి సిద్ధంగా లేను. జీవితంలో క్షమించనని అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదంతా చూసిన ఇందిరా దేవి.. బాధ పడకురా.. ఏదో ఒక రోజు అపర్ణ నిన్ను క్షమిస్తుందని అంటుంది. తను నన్ను క్షమిస్తుందని నేను అనుకోవడం లేదని సుభాష్ అంటాడు.

రాజ్‌ని ఆఫీస్‌కి వెళ్లేందుకు ఒప్పించిన ఇంట్లోని వాళ్లు..

నెక్ట్స్ రాజ్ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆ తర్వాత తాతయ్య, ఇందిరా దేవి, అపర్ణ, స్వప్న, ప్రకాశంలు కలిసి ఇగో మీద దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తారు. రాజ్ దగ్గరకు వెళ్లి.. ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు. మొక్కలకు నీళ్లు పోస్తున్నా అని అంటాడు. ఇక చాలురా నీళ్లు ఎక్కువై పైకి తేలిపోతాయని అంటుంది ఇందిరా దేవి. నాన్నా రాజ్ అందరి పనులు చక్కగా నువ్వే చేస్తున్నావ్ కాబట్టి.. వాళ్లకు జీతాలు ఇచ్చి ఇంటికి పంపేద్దాం అనుకుంటున్నా అని పెద్దాయన అంటే.. రాజ్ కంగరు పడుతూ అదేంటి? అని అడుగుతాడు. అందరి పనులు నువ్వే చేస్తే మళ్లీ వాళ్లకు జీతాలు ఎందుకు రా అని సీతారామయ్య అంటాడు. అంటే ఏంటి మావయ్య గారు నా కొడుకును పనివాడిగా మార్చాలి అనుకుంటున్నారా? అని అపర్ణ అంటుంది. మరి ఏం చేయమంటావు అపర్ణ.. వాడు కావ్యకి భయపడి ఆఫీస్‌కి వెళ్లడం లేదు కదా అని ఇందిరా దేవి అంటే.. భయపడి కాదు.. దుష్టులకు దూరంగా ఉండాలని రాజ్ అంటాడు. ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరా దేవి, స్వప్న, ప్రకాశంలు కలిసి రాజ్‌ని ఆఫీస్‌కి వెళ్లేందుకు ఒప్పిస్తారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కావ్య ఇచ్చిన షాక్‌కి దిగొచ్చిన క్లయింట్స్.. ఆఫీస్‌కి రాజ్..!
కావ్య ఇచ్చిన షాక్‌కి దిగొచ్చిన క్లయింట్స్.. ఆఫీస్‌కి రాజ్..!
ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్‌లో ఉన్నట్లే.. బీకేర్‌ఫుల్..
ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్‌లో ఉన్నట్లే.. బీకేర్‌ఫుల్..
గంజిలో బొప్పాయి గింజల పొడి కలుపుకుని తాగితే డాక్టర్‌తో పనే ఉండదు
గంజిలో బొప్పాయి గింజల పొడి కలుపుకుని తాగితే డాక్టర్‌తో పనే ఉండదు
17 ఏళ్లకే ప్రేమ, పెళ్లి ఆపై విడాకులు.. ఇప్పుడు స్టార్‌తో..
17 ఏళ్లకే ప్రేమ, పెళ్లి ఆపై విడాకులు.. ఇప్పుడు స్టార్‌తో..
రేయ్ ఎవర్రా మీరంతా..మరీ ఇలా ఉన్నారేంటిరా.. చెరువునే మింగేశారు..!
రేయ్ ఎవర్రా మీరంతా..మరీ ఇలా ఉన్నారేంటిరా.. చెరువునే మింగేశారు..!
బాబోయ్.. మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తే ఇంత ప్రమాదమా..?
బాబోయ్.. మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తే ఇంత ప్రమాదమా..?
మన దేశంలోనే కాదు ఈ దేశాల్లో దీపావళి వెరీ వెరీ స్పెషల్..
మన దేశంలోనే కాదు ఈ దేశాల్లో దీపావళి వెరీ వెరీ స్పెషల్..
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
సడెన్ కార్డియాక్ డెత్ రిస్క్ తగ్గించే చేపలు.. తప్పనిసరిగా తినాలి
సడెన్ కార్డియాక్ డెత్ రిస్క్ తగ్గించే చేపలు.. తప్పనిసరిగా తినాలి
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!