Bigg Boss 8 Telugu: 3 వారాలే ఉన్నా భారీగానే.. బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో సోమవారం (అక్టోబర్ 28)తో తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. కాగా చాలా మంది ఊహించినట్లుగానే ఆదివారం (అక్టోబర్ 27) నాటి ఎపిసోడ్ లో మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం పూర్తయ్యింది. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. చాలా మంది నయని పావని ఎలిమినేట్ అవుతుందని భావించినా నాగార్జున ఆమెను సేవ్ చేసి మెహబూబ్ ను బయటకు పంపించేశాడు. దీంతో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓమ్, కిర్రాక్ సీత, నాగ మణికంఠ ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోగా తాజాగా మెహబూబ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ నే కావడం గమనార్హం. 8వ వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉండగా.. మెహబూబ్, నయని పావనికి తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఈ వారం నయని పావనిపూ ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు. బిగ్ బాస్ రివ్యూయర్లు కూడా పావనినే బయటకు వచ్చేస్తుందని చెప్పేశారు. అయితే అనూహ్యంగా నాగార్జున నయనిని సేవ్ చేసి, మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో నిరాశగా బయటకు వచ్చాడు మెహబూబ్.
వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ మూడు వారాల పాటు హౌస్ లో కొనసాగాడు. అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ దాదాపు 21 రోజలు హౌస్ లో ఉన్నాడు. ఈక్రమంలో అతను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ తెలుగు 8 కోసం మెహబూబ్ దిల్ సే వారానికి రూ 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఈ లెక్కన 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 15 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం. కాగా గతంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ లోనూ కంటెస్టెంట్ గా వచ్చాడు మెహ బూబ్.
బిగ్ బాస్ బజ్ లో మెహబూబ్ దిల్ సే..
🌟 Don’t miss Mehaboob’s exclusive exit interview! Join Mehaboob and anchor Arjun for an engaging post-elimination chat packed with laughter, surprises, and heartfelt reflections on his journey. Catch all the fun and surprises only on #BiggBossTelugu8 #BiggBossBuzzz #StarMaaMusic pic.twitter.com/1WpBskmT3S
— Starmaa (@StarMaa) October 27, 2024
అందరికీ ధన్యవాదలు: మెహబూబ్ ఎమోషనల్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.