AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: అవినాశ్‌కు డాక్టర్ చెకప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు.. అసలు ఏమైందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎనిమిది వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 27) నాటి ఎపిసోడ్ లో మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అతను మరెవరో కాదు ప్రస్తుతం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన ముక్కు అవినాశ్.

Bigg Boss 8 Telugu: అవినాశ్‌కు డాక్టర్ చెకప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు.. అసలు ఏమైందంటే?
Jabardasth Avinash
Basha Shek
|

Updated on: Oct 28, 2024 | 6:13 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాల్టీ షో ఇప్పటికే తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ ఎనిమిది వారాల్లో ఏకంగా తొమ్మిది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ ఇప్పుడు మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆరోవారంలో మరో ఎనిమిది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్ట్ తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి పాత, కొత్త కంటెస్టెంట్స్ తో గతంలో కంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ మోతాదు పెరిగింది. కాగా ఎనిమిదో వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ముక్కు అవినాష్ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడని సమాచారం. నిన్నటి ఎపిసోడ్ ప్రోమోలోనే ‘సెల్ఫీ ఎలిమినేషన్’ అంటూ తన ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడీ జబర్దస్త్ కమెడియన్. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ.. అవినాష్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చూపించారు.

అవినాశ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, డాక్టర్స్ వచ్చి చెక్ చేసారని, చికిత్స చేయించుకోవాలని చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతను హౌస్ నుంచి వెళ్లిపోవడాన్ని కూడా లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. అలాగే అవినాష్ వెళ్లిపోయేటప్పుడు తోటి కంటెస్టెంట్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

తొమ్మిదో వారం నామినేషన్స్ లో ఉన్నది వీరే..

అయితే ఈ ప్రోమోను చూసిన బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు అవినాష్ ప్రాంక్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ డోర్స్ తీసి వెళ్లిపోవడం, కంటెస్టెంట్స్ కూడా ఏడ్వడంతో ఇది నిజమని మరికొందరు అంటున్నారు. మరి ఇది నిజమేనా లేక కాసేపు హౌస్ మేట్స్ ని ఆట పట్టించడాయికి బిగ్ బాస్ వేసిన ప్లానా తెలియాలంటే సోమవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ