AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యను గుర్తు పట్టారా? అందంలో స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే..

పై ఫొటోలో ఉన్నదెవరో కనిపెట్టారా? ఆమె టీమిండియా స్టార్ క్రికెటర్ సతీమణి. అయితే ఈ ట్యాగ్ కాకుండా ఆమెకు మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫేమస్ యూట్యూబర్ అయిన ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె ఎనర్జిటిక్ డ్యాన్సులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Team India: టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యను గుర్తు పట్టారా? అందంలో స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే..
Team India Cricketer Wife
Basha Shek
|

Updated on: Oct 27, 2024 | 8:36 PM

Share

పై ఫొటోలో ముఖం కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్నది టీమిండియా స్టార్ క్రికెటర్ సతీమణి. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు హిందీ టీవీ షోల్లో పాల్గొంది. ముఖ్యంగా ప్రముఖ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లా జా’ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మస్త్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఇన్ స్టా గ్రామ్ లోనే ఈ బ్యూటీని ఏకంగా ఆరు మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అయితే తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన డ్యాన్స్ కారణంగానే పలు సార్లు ట్రోలింగ్ బారిన పడిందీ సొగసరి. అయినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు టీమిండియా టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ. సోషల్ మీడియాలో మస్త్ యాక్టివ్ గా ఉండే ఆమె తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ధనశ్రీ వర్మ, చాహల్ ది ప్రేమ వివాహం. ఇరు పెద్దల అనుమతితో 2020 ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. హర్యానాలోని గురు గ్రామ్ లో వీరి వివాహం జరిగింది. కాగా ధనశ్రీ వర్మ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్. ఆమె డెంటిస్ట్, మోడల్, కొరియోగ్రాఫర్‌, సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముఖ్యంగా యూబ్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆమె డ్యాన్స్ లకు సోషల్ మీడియాలో మస్త్ క్రేజ్ ఉంది.

ఇవి కూడా చదవండి

భర్త చాహల్ తో ధనశ్రీ వర్మ..

గతంలో శ్రేయస్ అయ్యర్ తదితర భారత క్రికెటర్లతో కలిసి స్టెప్పులేసిందీ ముద్దుగుమ్మ. ఆ మధ్యన ధనశ్రీ వర్మ గర్భం ధరించిందని ప్రచారం జరిగింది. అయితే అది కేవలం రూమర్లు గానే మిగిలిపోయాయి. అలాగే ఫేమస్ యూట్యూబర్ గా ‘బిగ్ బాస్ లోకి ధనశ్రీ వర్మ అడుగుపెడుతుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు.

ధనశ్రీ వర్మ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో..