Santhoshi Srikar: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ పనిమనిషి గుర్తుందా? ఇప్పుడేంటి ఇంత అందంగా మారిపోయింది

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో శ్రీహరి, త్రిషల ఇంట్లో పని మనిషిగా అద్భుతంగా నటించిందీ అందాల తార. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్, డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ బెస్ట్ ఫీమేల్ కమెడియన్ కింద నంది అవార్డు కూడా రావడం విశేషం.

Santhoshi Srikar: 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీ పనిమనిషి గుర్తుందా? ఇప్పుడేంటి ఇంత అందంగా మారిపోయింది
Santhoshi Srikar
Follow us
Basha Shek

|

Updated on: Oct 26, 2024 | 8:46 PM

సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. కొరియాగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం 2005 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష అన్న పాత్రలో దివంగత శ్రీహరి అందరితో కన్నీళ్లు పెట్టించారు. అలాగే సునీల్, జయ ప్రకాశ్ రెడ్డి, అర్చన, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్, తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మరో హైలెట్ క్యారెక్టర్ ఉంది. అదే.. త్రిష ఇంట్లో పని చేసే అమ్మాయి. ‘జాగ్రత్త’ అనే మాట వింటే చాలు.. చేతిలోని వస్తువులు గబుక్కున కింద పడేసే అమ్మాయి పాత్రలో కడుపుబ్బా నవ్వించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ అమ్మాయి పేరు సంతోషి శ్రీకర్. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ టీవీ నటి పూర్ణిమ కూతురే ఈ అమ్మాయి. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబుకు స్వయానా కోడలు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకన్నా ముందు సంతోషి ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. అదే జై. నవదీప్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఫరా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో యువత హృదయాలను కొల్లగొట్టిందీ అందాల తార. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సహాయ నటిగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ బెస్ట్ ఫీమేల్ కమెడియన్ కింద నంది అవార్డు కూడా వచ్చింది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత ఒక్కడే, బంగారం, ఢీ చిత్రాల్లో కూడా నటించింది సంతోషి శ్రీకర్. అయితే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే వచ్చాయి. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైందీ ముద్దుగుమ్మ. అయితే ఖాళీగా ఉండకుండా బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో బిజినెస్ రన్ చేస్తోంది. చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ తదితర నగరాల్లో సంతోషి శ్రీకర్ బొటిక్స్ ఉన్నాయి. అంతేకాదు మేకప్ క్లాసెస్, శారీ డ్రాపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తోంది సంతోషి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నుకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోందీ అందాల తార. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కంటే కాస్త బొద్దుగా కనిపించినా అందం విషయంలో మాత్రం సంతోషి కిర్రాక్ పెట్టిస్తోందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సంతోషి శ్రీకర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

బోటిక్స్ క్లాసులు చెబుతోన్న సంతోషి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!