Tollywood: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

దృశ్యం మూవీ గుర్తుందా.? 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో.. నదియా కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. ఇక ఇందులో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన చిన్నది గుర్తుందా.?

Tollywood: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 26, 2024 | 7:59 PM

దృశ్యం.. 2014లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ.. మలయాళ చిత్రానికి రీమేక్. అక్కడ మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్దిక్ ముఖ్య పాత్రలు పోషించగా.. తెలుగులో వెంకటేష్, మీనా, కృతిక, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రల్లో కనిపించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి.. ఆ తర్వాత మరో రెండు పార్ట్‌లు వచ్చాయి. ఇక అవి కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే.. దృశ్యం ఫస్ట్ పార్ట్‌లో వెంకటేష్ చిన్నకూతురుగా నటించిన అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అండీ.! అందాలతో సోషల్ మీడియాలో గత్తరలేపుతోంది.

ఎస్తేర్ అనిల్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. తొలుత చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో నల్లవన్ అనే చిత్రం ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు వెర్షన్లలో తెరకెక్కిన దృశ్యం మూవీలో నటించింది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ.. హీరోయిన్‌గా ఇటీవల తమిళంలో మిన్మిని అనే చిత్రం చేసింది. అటు బుల్లితెరపై 2018లో టాప్ సింగర్ అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం హీరోయిన్ లుక్‌లోకి మారిపోయిన ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ.. కుర్రకారును ఆకట్టుకుంటోంది. బికినీలో అందాల ఆరబోత చూపిస్తూ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తోంది. కాగా, ఈ బ్యూటీ ఇన్‌స్టా ఫోటోలపై లైకులు వెల్లువెత్తుతున్నాయి. లేట్ ఎందుకు వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

View this post on Instagram

A post shared by Esther Anil (@_estheranil)

View this post on Instagram

A post shared by Esther Anil (@_estheranil)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి