- Telugu News Photo Gallery Business photos Delhi To Patna: Vande Bharat Express Longest Route For Festive Travellers, Know the distance
భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు ఏదో తెల్సా.? ఏ రూట్‌లోనంటే
భారతదేశపు ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కేందుకు సిద్దమయింది. న్యూఢిల్లీ నుండి పాట్నా నగరాల మధ్య ఈ కొత్త వందే భారత్ నడవనుంది. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని..
Updated on: Oct 25, 2024 | 4:57 PM

సాధారణంగా దూర ప్రాంతాల రైలు ప్రయాణం.. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ దూరం కూడా దగ్గరయ్యింది. కానీ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఓ వందేభారత్ రైలు ఉంది.. అదేంటో తెల్సా

ఢిల్లీ టూ పాట్నా.. భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఈ రెండు నగరాల మధ్య నడవనుంది. ఈ సిటీల మధ్య ఉన్న 1000 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 11 గంటల 35 నిమిషాలలో కవర్ చేస్తుంది వందేభారత్.

ఈ రైలు అక్టోబర్ 30న పట్టాలెక్కనుండగా.. న్యూఢిల్లీ నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం నడవనుండగా.. పాట్నా నుంచి సోమవారం, గురువారం నడవనుంది.

ఢిల్లీ నుంచి ప్రతీ రోజు ఉదయం 8.25 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్.. పాట్నాకి రాత్రి 8 గంటలకు చేరుతుంది. అలాగే పాట్నా నుంచి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. ఢిల్లీకి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది.

ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 4,655గా ఉంది. ఈ రైలు కాన్పూర్, ప్రయాగరాజ్, దీన్‌డయల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్, అరా జంక్షన్ స్టాప్‌లలో ఆగుతుంది.




