- Telugu News Photo Gallery Business photos Budget bikes are the new record in sales, That company is the first place, 125 cc Best bikes details in telugu
Best bikes: సేల్స్‌లో బడ్జెట్ బైక్స్ సరికొత్త రికార్డు.. ఆ కంపెనీదే మొదటి స్థానం
దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ పలు కంపెనీల బైక్ లు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో 125 సీసీ బైక్ ల హవా నడుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ, స్లైలిష్ లుక్, ఇంధన సామర్థ్యం తదితర కారణాలతో వీటికి ఆదరణ లభిస్తోంది. హోండా, బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీల మధ్య ప్రముఖంగా పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో జరిగిన అమ్మకాల ఆధారంగా ఏ బైకులు ఏ స్థానంలో నిలిచాయో తెలుసుకుందాం.
Updated on: Oct 25, 2024 | 4:15 PM

హీరో స్ల్పెండర్ బైక్ కు వినియోగదారుల ఆదరణ లభించింది. సెప్టెంబర్ లో 26,318 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. గతంలో పోల్చితే 3.16 శాతం పెరిగింది. హీరో స్ల్పెండర్ 125 సీసీ బైక్ ధర రూ.75,441 నుంచి రూ.78,286 వరకూ ఉంది.

హీరో ఎక్స్ ట్రీమ్ 125 బైక్ రూ.95 వేల నుంచి రూ.99,500 ధరలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ లో 37,520 ఎక్స్ ట్రీమ్ బైక్ యూనిట్లను కంపెనీ విక్రయించింది. అమ్మకాలలో హీరో ఎక్స్ ట్రీమ్ 125 బైక్ నాలుగో స్థానంలో నిలిచింది.

హోండా కంపెనీ నుంచి విడుదలైన ఎస్పీ 125/ షైన్ 125 సీసీ మోటారు సైకిళ్లు సెప్టెంబర్ లో జరిగిన అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచాయి. హోండా ఎస్పీ, షైన్ మోాటారు సైకిళ్ల యూనిట్లను ఆ కంపెనీ 1,53,476 విక్రయించింది. గతేడాదిలో పోల్చితే దాదాపు 13.40 శాతం ఎక్కువ. హోండా షైన్ రూ.81,251 నుంచి రూ.85,251 ధరకు, హోండ్ ఎస్పీ రూ.87,468 నుంచి రూ.91,468 ధరకు అందుబాటులో ఉన్నాయి.

అమ్మకాలలో రెండో స్థానంలో బజాజ్ కంపెనీ బైక్ లు నిలిచాయి. పల్సర్ 125/ ఎన్ఎస్ 125 బైక్ ల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆ కంపెనీ సెప్టెంబర్ నెలలో 67,256 యూనిట్లను విక్రయించింది. బజాజ్ పల్సర్ 125 రూ.92,883, ఎన్ ఎస్ 125 బైక్ రూ.1.01 లక్షలకు అందుబాటులో ఉంది. పైవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు

టీవీఎస్ నుంచి విడుదలైన రైడర్ బైక్ అమ్మకాలలో మూడో స్థానం సాధించింది. టీవీఎస్ రైడర్ కు చెందిన 43,274 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. ఈ మోటారు సైకిల్ రూ.84,869 నుంచి రూ.1.04 లక్షల ధరలో అందుబాటులో ఉంది. అయితే గతేడాది 48,753 రైడర్ బైక్ అమ్ముడయ్యాయి. వాటితో పోల్చితే ఈ సారి తగ్గుముఖం పట్టినట్టే.




