- Telugu News Photo Gallery Business photos Vivek Express the longest train route in India, connects Dibrugarh in Assam to Kanyakumari in Tamil Nadu
80 గంటలు, 50 స్టాప్‌లు.. బాబోయ్.! ఇదేం రైలుబండిరా సామీ.. ప్రయాణం ఎన్ని రోజులంటే.?
భారతదేశంలో రైలు ప్రయాణం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ప్రయాణీకులకు అందిస్తుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాల దగ్గర నుంచి రమణీయమైన గ్రామీణ ప్రాంతాల వరకు ఉండే నేచర్ ప్రతీ ప్రయాణీకుడిని అలరిస్తుంది. భారతదేశంలో పొడవైన రైలు మార్గాలు ఉన్న సంగతి తెలిసిందే. అవి ఏవిటంటే..
Updated on: Oct 24, 2024 | 5:54 PM

ఇండియన్ రైల్వేస్.. దేశంలో రోజూ వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఇక రైల్వేలో అత్యంత పొడవైన రైలు ప్రయాణమూ.. తక్కువ గంటల నిడివి గల ప్రయాణం కూడా ఉంది.

రైళ్లల్లో కొందరి ప్రయాణం ఒక గంట ఉంటే.. మరికొందరి ప్రయాణం ఒకట్రెండు రోజులు ఉంటుంది. ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం ఏంటో తెలుసుకుందామా..

వివేక్ ఎక్స్‌ప్రెస్.. భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 4,200 కి.మీ ప్రయాణం చేస్తుంది.

అలాగే ఈ ట్రైన్ వారానికోసారి పట్టాలెక్కుతుంది. ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుంది. అలాగే ఈ రైలు మార్గంలో దాదాపుగా 50 స్టాప్‌లు ఉంటాయి.

వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను చూపిస్తుంది.




