Viral: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
వేల ఏళ్ల నాటి డైనోసార్లు మళ్లీ బ్రతికి నిజ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది.? ఈ క్వశ్చన్ వినడానికే భయం వేస్తోంది కదూ..! కంగారుపడకండి.. అవేమి ఇప్పుడు రావు.. కానీ వాటికీ సంబంధించిన శిలాజాలు..
డైనోసర్లు.. ఏళ్ల కిందట అంతరించిపోయిన ఈ జాతి.. మళ్లీ బ్రతికి వస్తే ఎలా ఉంటుంది.? ఈ ప్రశ్న వింటేనే ఒళ్లంతా చెమటలు పడుతున్నాయ్ కదూ.! వేల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసర్లు.. ఇప్పుడు జనం మధ్యలోకి వచ్చే అవకాశం లేదు గానీ.. అప్పుడప్పుడూ వాటికి సంబంధించిన శిలాజాలు మాత్రం పురావస్తు తవ్వకాల్లో బయటపడుతుండటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా అత్యంత చిన్నసైజులోని డైనోసార్ గుడ్లు.. చైనాలో బయటపడ్డాయి. ఇక శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గన్‌జౌ సమీపంలోని ఓ నిర్మాణ స్థలంలో నల్లటి ఆకారంలో ఆరు చిన్నపాటి డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. రాళ్ల కుప్పల మధ్య వీటిని గుర్తించారు. ఆ తర్వాత ఆ గుడ్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా.. ఇవి సుమారు 66 నుంచి 145 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి క్రెటేషియన్ కాలానికి చెందినవని తేల్చారు. ఇక ఇప్పటివరకు చాలారకాల డైనోసార్ గుడ్లు దొరికాయని.. కానీ ఇలా చిన్నపాటి గుడ్లు దొరకడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ గుడ్లు 1.1 అంగుళాల పొడవు ఉన్నాయని.. ఇలాంటి పరిమాణంలోనే గతంలో జపాన్‌లో బయటపడ్డయన్నారు. ఇక ఈ గుడ్ల శిలాజం ఏమాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. ఇక సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..