AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెదవుల ఆకృతి బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు.. ఎలాగో తెల్సా

మీరు ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చినట్లయితే.. వారి వ్యక్తిత్వాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. క‌ళ్లు, అర‌చేతి, పిడికిలి, మాట్లాడే తీరు.. ఇలా ప్రతీ ఒక్క పాయింట్ ద్వారా మన వ్యక్తిత్వ లక్షణాలను చెప్పొచ్చుట. మరి మీ పెదవుల ఆకృతి బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చా.?

పెదవుల ఆకృతి బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు.. ఎలాగో తెల్సా
Lips Shape Personality Test
Ravi Kiran
|

Updated on: Oct 24, 2024 | 5:22 PM

Share

పైకి ఒకేలా కనిపించే ప్రతీ ఒక్కరూ.. లోపల ఒక్కో శైలి కలిగి ఉంటారు. వ్యక్తిత్వ లక్షణాలు, స్వభావం.. ఇలా ప్రతీది విభిన్నంగా ఉంటాయి. పెదవుల ఆకృతి బట్టి మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పేయొచ్చునట. ఇక అందరి పెదవులు ఒకేలా ఉండవు. ఒకరివి కాస్త మందంగా.. మరొకరి పెదవులు సన్నగా, ఇంకొకరి పెదవులు పెద్దగా ఉంటాయి. మరి వాటి ద్వారా వారి వ్యక్తిత్వ లక్షణాలు చెప్పొచ్చునని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

చిన్న పెదవులు:

ఇలాంటి పెదవుల ఆకృతి ఉన్నవారు తమకు చెందిన వస్తువులను ఇతరుల నుంచి ఎలప్పుడూ దాచిపెడుతుంటారు. చాలా ఆలోచించి మాట్లాడతారు. అలాగే ఈ వ్యక్తులు ఇతరుల మాటలను అంత తేలిగ్గా నమ్మరు. ఎవరినైనా నమ్మాలనుకున్నప్పుడు, వెయ్యి సార్లు ఆలోచిస్తారు.

పెద్ద పెదవులు:

ఇలాంటి వారు చాలా తెలివైనవారు. వీరు ఇతరుల మనస్సులో ఈజీగా చోటు సంపాదించుకుంటారు. అలాగే ఇలాంటి వ్యక్తులు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మందపాటి పెదవులు:

ఇలాంటి వారు స్వతహాగా లవర్స్. ఈ వ్యక్తులు అందరి మాటలకు త్వరగా మోసపోతారు. సులభంగా భ్రమపడటం వీరిలోని బలహీనత. దీని వల్లే వీరి మనస్సు ఎక్కువగా గాయపడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

సన్నని పెదవులు:

ఇలాంటివారు మేధావులు. ఈ వ్యక్తులు తమ ఆలోచనలు, భావాలను ఇతరులతో చాలా అరుదుగా పంచుకుంటారు. వీరు అంతర్ముఖులు, పిరికివారు. సమస్యలను పరిష్కరించడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఎలప్పుడూ విజయవంతమవుతారు.

నిండైన పెదవులు:

వీరు మరింత ప్రేమగా, ఆశావాదంతో కలిగి ఉంటారు. తమ అవసరాలను కాకుండా ఇతరుల అవసరాలను తీర్చేందుకు కష్టపడతారు. వీరు అతి విశ్వాసం, మొండి పట్టుదల గల వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారు. ఎలప్పుడూ కోపంతో ఉంటారు.

విల్లు ఆకారపు పెదవులు:

ఈ వ్యక్తులు మంచి సంభాషణకర్తలు. అందువల్ల వారు తమ మాటలతో ప్రజలపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతారు. ఈ వ్యక్తులు రొమాంటిక్‌గా ఉంటారు. వారు ఎక్కడైనా తమ స్వంత హోదాను సంపాదించుకుంటారు.

ఇది చదవండి: దొరికేందోచ్.! మత్తు వదలరా 2లో ఈ అమ్మడు గుర్తుందా.? బయట రచ్చ మాములుగా లేదుగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..