AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఓరి దేవుడా.! ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఆ జిల్లాలకు భారీ హెచ్చరిక

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను తీవ్రత పెరుగుతోంది. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, గాలులకు హెచ్చరిక జారీ చేశారు. ఆ వివరాలు ఇలా..

AP Rains: ఓరి దేవుడా.! ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఆ జిల్లాలకు భారీ హెచ్చరిక
Representative Image
Ravi Kiran
|

Updated on: Oct 23, 2024 | 7:26 PM

Share

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ కేంద్రీకృతమై ఉంది. గురువారం అనగా అక్టోబర్ 24న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా(ఒడిశా) సమీపంలో తీరం దాటనున్న తుపాన్.. ప్రస్తుతానికి పారాదీప్(ఒడిశా)కి 520 కిమీ.. సాగర్ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్) 600 కిమీ.. ఖేపుపరా(బంగ్లాదేశ్)కి 610 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని తీర ప్రాంతం వెంబడి బుధవారం మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది వాతావరణ శాఖ. అలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అటు తుఫాన్ ప్రభావంతో గురువారం రాత్రి నుంచి 100-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.

ఇది చదవండి: ఓ మై గాడ్.! కారు కొన్నంత ఈజీగా విమానాన్ని కొనేయొచ్చు.. ఎలాగో తెల్సా

భారీ వృక్షాలు, చెట్ల దగ్గర/కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు. ఎండిపోయిన చెట్లు/విరిగిన కొమ్మల కింద ఉండకండి. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి. కరెంట్/టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండండని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధు, గురువారాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు తుఫాన్ తీవ్రత బట్టి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని స్కూల్స్‌కి సెలవులు ఇవ్వనున్నారు అధికారులు. వాతావరణ పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. జిల్లాల్లోని స్కూల్స్‌కు సెలవులు ఇవ్వడంపై ఆయా డిస్ట్రిక్ట్ కలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మంచు కొండల్లో అదో మాదిరి వింత ఆకారం.. విషయం తెలిస్తే.. అయ్యబాబోయ్.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..