మీ పాదాల ఆకృతి మీరెలాంటి వారో చెప్పేస్తుందట.. ఎలాగో తెల్సా
పాదాల ఆకృతి వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేస్తుందని బిహేవియరల్ విశ్లేషకులు చెబుతున్నారు. చదునుగా ఉన్న పాదాలు ఓపెన్ మైండెడ్‌నెస్‌ను, బంధాలకు ప్రాధాన్యతను సూచిస్తాయి. వంపు తిరిగిన పాదాలు స్వతంత్రత, దూరదృష్టి, తెలివితేటలను సూచిస్తాయి.
హస్త సాముద్రికం, న్యూమరాలజీ మాత్రమే కాదు.. మనిషి శరీరంలోని ప్రతీ అవయవ ఆకృతిని బట్టి కూడా అతడి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు బలాలు, బలహీనతలు, మనస్తత్వం, వ్యక్తి ప్రవర్తనా ధోరణి గురించి కూడా చెప్పొచ్చునని బిహేవియరల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కోవలోనే మీ పాదాల ఆకృతి మీ గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.. కొందరికి పాదాలు వంపుగా ఉంటే.. ఇంకొందరికి పాదాల కింద భాగం చదునుగా ఉంటుంది. మరి ఈ రెండు ఆకారాల్లో మీ పాదాలు ఏ ఆకారంలో ఉన్నాయి.? అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోంది.
పాదాల ఆకృతి చదునుగా ఉంటే..
పాదాల ఆకృతి చదునుగా ఉన్నవారు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. వీరు వాస్తవికతను ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవడమే కాదు.. ఎప్పుడూ నలుగురితో మాట్లాడుతూ, కలుస్తూ కలుపుగోలుగా ఉంటారు. వీరికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువనే చెప్పాలి. అలాగే నచ్చిన వ్యక్తుల దగ్గర వీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ వ్యక్తులు బంధాలు, బంధుత్వాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. నేచురల్‌గా ఉండే వీరు.. ప్రతీ విషయాన్ని రిలాక్స్‌డ్‌గా వింటారు. ప్రతీ చాలెంజ్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఎదుర్కుంటారు. సీరియస్ అనే మాట వీరి డిక్షనరీలో ఉండదు.
పాదాల ఆకృతి వంపు తిరిగి ఉంటే..
ఇలాంటి ఆకృతి ఉన్నవారిలో దూరదృష్టి ఎక్కువ. వీరు ఇండిపెండెంట్. స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతీ విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ఇంటిలిజెంట్ పీపుల్ అని అర్ధం. సింగిల్‌గా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. బుక్ రీడింగ్, ప్రతీ అంశాన్ని నేర్చుకోవడం లాంటి వాటిపై వీరికి ఆసక్తి ఎక్కువ. వీరు జీవితంలో సవాళ్లను ఇష్టపడతారు, వాటిని తెలివిగా ఎదుర్కుంటారు. ప్రతీ లక్ష్యాన్ని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వీరు ఎలప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటారు.. పరిస్థితి ఏదైనా కూడా ఇతరుల సహాయం లేకుండా ఎదుర్కుంటారు. వీరు అంతర్ముఖులు, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను అంచనా వేసేస్తారు. ఇతరులతో అంత ఈజీగా రిలేషన్ పెట్టుకోరు. ఒకసారి పెట్టుకుంటే.. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..