AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: లక్షకు రూ. 3 లక్షలు.. పైగా ప్రతీ ఏటా రూ. 12 వేలు.. మ్యాజిక్ చేసే మల్టీబ్యాగర్ స్టాక్

వేదాంత లిమిటెడ్ స్టాక్ గత ఏడాది 100% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది, ఐదు సంవత్సరాలలో 217% రాబడిని అందించింది. అధిక డివిడెండ్‌తో, ఇది మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిరూపించుకుంది. కంపెనీ మార్కెట్ విలువ 1.87 లక్షల కోట్లు. స్టాక్ ధర 52 వారాల కనిష్ఠం నుండి గరిష్ఠానికి పెరిగింది.

Multibagger Stock: లక్షకు రూ. 3 లక్షలు.. పైగా ప్రతీ ఏటా రూ. 12 వేలు.. మ్యాజిక్ చేసే మల్టీబ్యాగర్ స్టాక్
Multibagger Stock
Ravi Kiran
|

Updated on: Oct 17, 2024 | 1:49 PM

Share

స్టాక్ మార్కెట్ అంటేనే వైకుంఠపాళీ లాంటిది. ఎప్పుడు ఎవరికి నిచ్చెన తగులుతుందో.. ఎవరు పాము చేతుల్లో చిక్కుతారో చెప్పలేం. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేవారు కూడా ఈకోవలోకి వస్తారు. కొందరికి అదృష్టం చాలా తక్కువ సమయంలోనే దక్కితే.. మరికొందరికి అదృష్టం వరించేందుకు ఏళ్లు పడుతుంది. ఇక కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్.. అనతికాలంలోనే భారీగా రిటర్న్స్ ఇస్తుంటాయి. ఆ కోవకు చెందిన స్టాక్ వేదాంత లిమిటెడ్. ముంబైకి చెందిన ఈ మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ.. తమ షేర్ హోల్డర్స్ ప్రతీ సంవత్సరం డివిడెండ్ ఇస్తూ వస్తోంది. అదీ కూడా మిగిలిన స్టాక్స్ కంటే.. భారీగా ఇస్తుంది.

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

అటు ఈ కంపెనీ షేర్లు కొన్నవారికి దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. ఏడాది కాలంలో ఈ స్టాక్ 100 శాతానికి పైగా రిటర్న్స్, అలాగే ఐదేళ్లకు 217 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చింది. అంటే రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినవారికి.. ఏడాదిలో రూ. 20 లక్షలు మాత్రమే కాదు.. ఎక్స్‌ట్రాగా డివిడెండ్ మరో రూ. 1.15 లక్షలు వచ్చినట్టు. ఒకవేళ మీరు ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రతీ సంవత్సరం డివిడెండ్ రూపం(8.85%)లో రూ. 12 వేల వరకు రాబడి పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

52 వారాల కనిష్ఠ ధర రూ. 211.20 నుంచి ఈ స్టాక్.. 52 వారాల గరిష్ట ధర రూ. 523.65 వద్దకు చేరుకుంది. ప్రస్తుతం ఐదు రోజుల నుంచి 4.15 శాతం నెగటివ్‌లో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్.. ఒక నెలలో 5.89 శాతం, 6 నెలల కాలంలో 22.61 శాతం గ్రోత్ చూపిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ 1.87 లక్షల కోట్లగా ఉంది. ఈ కంపెనీ షేరు స్టాక్ మార్కెట్‌లో లిస్టు అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 13,661 శాతం మేర పెరిగి ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. ఓసారి మీరూ లుక్కేయండి.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..