AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

సరిపోదా శనివారం మూవీ.. నేచురల్ స్టార్ నానికి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టింది. ఇందులో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించాడు. తమిళ నటుడు ఎస్‌జె సూర్య కీలక పాత్ర పోషించాడు.

సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 16, 2024 | 11:30 AM

Share

హీరో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సరిపోదా శనివారం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా నాని ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సూర్య అనే పాత్రలో జీవించేశాడు. ఇక ఇందులో నానికి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా.? అతడి అక్క పాత్రలో ఆమె చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో.? బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే..

ఆ నటి మరెవరో కాదు.. తమిళ హీరోయిన్ అదితి బాలన్. అరువి అనే చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. మొదటి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కుట్టీ స్టోరీతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన కోల్డ్ కేస్ చిత్రంలో నటించింది. అలాగే నివిన్ పౌలీ పదవెట్టు చిత్రంలోనూ మెరిసింది ఈ భామ. ఇక తెలుగులో సమంతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో.. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. లేటెస్ట్‌గా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీలోనూ అమ్మడు మెరిసింది. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. మూడు ఇండస్ట్రీలలోనూ సక్సెస్ రేట్ ఎక్కువేనని చెప్పాలి.

ఇవి కూడా చదవండి

అదితి బాలన్.. కేవలం నటి మాత్రమే కాదు.. డ్యాన్సర్, మోడల్, లాయర్ కూడా. సినిమాలే కాకుండా ‘నవరస’, ‘స్టొరీ ఆఫ్ థింగ్స్’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదితి బాలన్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?