OTT: సీను సీనుకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ.. ఈ హారర్ మూవీ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

హారర్ మూవీలకంటూ సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో అయితే వీటికి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కొందరైతే భయపడుతూనే.. ఈ సినిమాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక ఓటీటీలలో హారర్ సినిమాలకు కొదవ లేదు. కొత్తగా ఏ హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చినా.. చూడకుండా..

OTT: సీను సీనుకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ.. ఈ హారర్ మూవీ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
Ott Movie
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 08, 2024 | 11:33 AM

హారర్ మూవీలకంటూ సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో అయితే వీటికి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కొందరైతే భయపడుతూనే.. ఈ సినిమాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక ఓటీటీలలో హారర్ సినిమాలకు కొదవ లేదు. కొత్తగా ఏ హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చినా.. చూడకుండా వదిలిపెట్టరు ఓ వర్గానికి చెందిన జనం. మరి అలా హారర్ మూవీస్ అంటే క్రేజ్ ఉన్నవారికి ఈ సజెషన్. ఈ మూవీ స్టోరీ ఏంటి.? ఎక్కడ చూడొచ్చునంటే.?

కథ విషయానికొస్తే.. అదొక మారుమూల పల్లెటూరు. పెడ్రో, జైన్ అనే ఇద్దరు అన్నదమ్ములు నివాసముంటున్నారు. అక్కడే వ్యవసాయం చేసుంటూ బ్రతుకు జీవనం సాగిస్తుంటారు. ఇక వారికి ఒకానొక సమయంలో ఆ ఊర్లో దెయ్యం ఉద్బవిస్తోందని విషయాన్ని తెలుసుకుంటారు. ఇక అది ఈ ప్రపంచంలోకి రాకముందే దాన్ని నాశనం చేయాలనుకుంటారు. ఆ క్రమంలోనే దెయ్యం ఉద్బవించే బాడీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ ఆలోచనే వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. దెయ్యంతో అంత ఈజీ కాదు కదా.! ఆ దెయ్యం వీరిపై ఎదురుదాడికి దిగుతుంది. ఆ ఇద్దరు అన్నదమ్ములు చివరికి ఏం అయ్యారు.? అనుకున్న పనిని చేయగలిగారా.? అనే విషయాలను మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎక్కడ చూడొచ్చునంటే.? ఈ సినిమా పేరు ‘వెన్ ఈవిల్ లర్క్స్’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇదొక స్పానిష్ హారర్ మూవీ. స్పానిష్ అయితేనేం ఓటీటీలో అన్ని భాషల్లోనూ డబ్బింగ్ కాపీలు సిద్దంగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో థియేటర్స్‌లోకి విడుదలైన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాను స్పానిష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఇజాక్వెల్ రోడ్రిక్స్, డిమియన్ సోలోమోన్ ప్రధాన పాత్రలు పోషించారు. డెమియన్ రుగ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మీకొకటి చెప్తాం.. ఈ సినిమా చాలా చాలా వయోలెంట్ గురూ.!

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్