AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. మీరూ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడుతుంటే.? ఈ మూవీ మీకోసమే. సాధారణంగా ఈ కాలంలో ప్రతీ ఒక్కరి నోటా 'ఎఫైర్' అనే మాట వినిపిస్తుంది. ఈ సినిమా చూశారంటే..

OTT: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Udal Ott Movie
Ravi Kiran
|

Updated on: Oct 04, 2024 | 12:22 PM

Share

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. మీరూ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడుతుంటే.? ఈ మూవీ మీకోసమే. సాధారణంగా ఈ కాలంలో ప్రతీ ఒక్కరి నోటా ‘ఎఫైర్’ అనే మాట వినిపిస్తుంది. ఈ సినిమా చూశారంటే.. ఆ మాట వినగానే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో చూడొచ్చు.? స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్ 2022, మే 20న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ధ్యాన్ శ్రీనివాసన్, దుర్గా కృష్ణ, ఇంద్రన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పేరు ‘ఉడల్’. రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 5 నుంచి సైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌పై చర్చలు జరగడంతో.. ఓటీటీలోకి రావడానికి ఆలస్యమైంది. ఈ మూవీ ప్రస్తుతం సైనా ఓటీటీలో, అలాగే కొన్ని ప్రాంతాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

కథ విషయానికొస్తే.. షైనీ అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భర్తకు దూరంగా ఉండే ఓ మహిళ.. మంచాన పడిన అత్తగారితో పాటు గుడ్డివాడైన మామను చూసుకుంటుంది. ఆమె భర్త వేరే ఊరిలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దలను చూసుకుంటుండటంలో.. విసుగు చెందిన ఆమెకున్న ఒకే ఒక్క ఓదార్పు ఓల్డ్ కాలేజీ మేట్ కిరణ్. భర్త లేని సమయంలో అండగా నిలిచిన అతడితో హీరోయిన్ ఎఫైర్ పెట్టుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ.. వీరిద్దరి మధ్య రిలేషన్ వేరే లెవెల్‌కు చేరుకుంటుంది. దీంతో తమకు అడ్డుగా ఉన్న అత్తామామలను చంపాలని ప్లాన్ చేస్తారు. ఇక ఈ విషయం మామకు తెలియడంతో.. ఆ గుడ్డివాడు ఏం చేశాడు.? వాళ్ల నుంచి ఎలా తప్పించుకున్నాడు.? అనేది ఓటీటీలో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి.. ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి