Bigg Boss 8: యష్మీకి దెబ్బమీద దెబ్బ.. డాక్టర్ బాబు కూడా గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..!
నబీల్ మెగా చీఫ్ అవ్వడంతో ఆతన్ని ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక కొత్తగా వచ్చిన వారు ఆల్రెడీ హౌస్ లో ఉన్న వారిని నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. ఇక మొదటిగా హరితేజ మొదలు పెట్టింది. యష్మీ, పృథ్వీ ని నామినేట్ చేసింది. ఆతర్వాత గౌతమ్ రంగంలోకి వచ్చాడు.. విష్ణుప్రియకి వేశాడు. రీజన్ కూడా గట్టిగానే చెప్పాడు. నువ్వు నీ గేమ్ ఆడకుండా.. నీ గేమ్ వదిలేసి.. వేరే రూట్‌లో వెళ్తున్నావని..
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హంగామా జరుగుతోంది. కొత్తగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎనిమిది మంది వచ్చారు. ఇక పాత కంటెస్టెంట్స్ కు కొత్తగా వచ్చిన వారికి మధ్య నామినేషన్స్ చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. ఇక నబీల్ మెగా చీఫ్ అవ్వడంతో ఆతన్ని ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక కొత్తగా వచ్చిన వారు ఆల్రెడీ హౌస్ లో ఉన్న వారిని నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. ఇక మొదటిగా హరితేజ మొదలు పెట్టింది. యష్మీ, పృథ్వీ ని నామినేట్ చేసింది. ఆతర్వాత గౌతమ్ రంగంలోకి వచ్చాడు.. విష్ణుప్రియకి వేశాడు. రీజన్ కూడా గట్టిగానే చెప్పాడు. నువ్వు నీ గేమ్ ఆడకుండా.. నీ గేమ్ వదిలేసి.. వేరే రూట్‌లో వెళ్తున్నావని.. కాన్సట్రేషన్ వేరే వాళ్లపైన ఉందని నాకు అనిపిస్తుంది అని నామినేట్ చేశాడు గౌతమ్. బిగ్‌బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో.. నాకు ఇక్కడ అందరితో మంచి బాండింగ్ ఉంది అని డిఫెన్స్ చేసుకుంది విష్ణు ప్రియా. నాకు ఏమనిపిస్తే అదే చేస్తా.. అది మీకు నచ్చకపోతే మీ ఇష్టం అంటూ విష్ణుప్రియ చెప్పింది.
యష్మీకి వేశాడు గౌతమ్. రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు.. మణికంఠను ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్‌గా అనిపించలేదు. పప్పి టాస్క్ లోనూ మణికంఠను బెదరించావ్ అని అన్నాడు డాక్టర్ బాబు. వాడు నా వల్ల ఏడవలేదు.. సీత అన్నందుకు ఏడ్చాడు.. అయినా సరే నేనే వెళ్లి ఓదార్చా.. అయితే నేను బెదిరించినట్లు మాట్లాడా అని మీరు అంటున్నారు.. కానీ నాకు అది గుర్తు లేదు.. అని చెప్పుకొచ్చింది. అలాగే మణికంఠ ఏడిస్తే నాకు కూడా బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది యష్మీ.
ఆతరువాత నయని పావని.. ముందుగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. నీకు సీరియస్ నెస్ అస్సలు లేదు.. నువ్వు ఈ వారం నాకు చీఫ్ అవ్వాలని లేదు.. ఆరో వారం అవుతాను అంటూ చెప్తున్నావ్..నీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు గెలవాలనే తపన లేనప్పుడు వేరే వాళ్లకి ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా అన్ని నయనిపావని చెప్పుకొచ్చింది. దానికి విష్ణు కూడా గట్టిగానే రిప్లే ఇచ్చింది. నా లైఫ్‌లో సీరియస్‌నెస్ లేదు.. నాకు ఏది కావాలో అదే సీరియస్‌గా తీసుకుంటా.. అందుకే నా కెరీర్‌లో ఇంతవరకూ పైకి వచ్చా.. నాలో ఏదో ఉందనే ఈ షో వాళ్లు నన్ను పిలిచారు.. ఓన్లీ చీఫ్ అయితేనే విన్ అవుతారా.. అంటూ విష్ణు అడిగింది. ఇక ఇద్దరి మధ్య డిస్కషన్ గట్టిగానే జరిగింది సెకండ్ నామినేషన్ సీతకి వేసింది నయని. మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమ్ ఎక్కువ కనిపించలేదు.. అంతకుముందు చాలా ఫైర్ ఉండేది.. కానీ ఇప్పుడు అది లేదు అని చెప్పింది. అలాగే నిన్న మేము హౌస్ లోకి వచ్చిన సమయంలో అందరూ బాగా వెల్కమ్ చెప్పారు.. కానీ మీరు కనీసం నవ్వలేదు అంటూ నయని అంది. దానికి నిన్న నా ఫ్రెండ్ నైనికా ఎలిమినేట్ అయ్యింది. ఆ బాధలో ఉన్నాను. అందుకే అలా ఉన్న ఇప్పుడు హగ్ ఇస్తా రా అని సీత నయానికి హగ్ ఇచ్చింది.