హీరోయిన్లకు టెన్షన్ పుట్టించే అందంరా బాబు.. మళ్లీ రావా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా?

'మళ్లీ రావా' మూవీ గుర్తుందా.? సుమంత్ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2017లో విడుదలైన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల చిన్నప్పటి క్యారెక్టర్లలో సాత్విక్, ప్రీతి ఆస్రానీ నటించారు.

హీరోయిన్లకు టెన్షన్ పుట్టించే అందంరా బాబు.. మళ్లీ రావా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా?
Tollywood 1
Follow us

|

Updated on: Oct 09, 2024 | 8:15 PM

‘మళ్లీ రావా’ మూవీ గుర్తుందా.? సుమంత్ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2017లో విడుదలైన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల చిన్నప్పటి క్యారెక్టర్లలో సాత్విక్, ప్రీతి ఆస్రానీ నటించారు. ఇక మనం ఇప్పుడు ప్రీతీ అస్రానీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అందంలో స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోదు.

మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించింది. గుజరాత్‌కి చెందిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఇక 2017లో మళ్లీ రావా సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించిన ఈ భామ.. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారికకు చెల్లిగా, సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రీతీ ఆస్రానీ. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది. అనంతరం ప్రీతికి తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ రాలేదు. అటు సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది ఈ వయ్యారి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతీ.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ లుక్కేయండి.

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి