AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రంగం బ్యూటీ.. ఇప్పుడెలా ఉందో చూస్తే

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన 'జోష్' మూవీ గుర్తుందా.? ఈ సినిమా ద్వారా అలనాటి తార రాధ కుమార్తె కార్తీక నాయర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది.

Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రంగం బ్యూటీ.. ఇప్పుడెలా ఉందో చూస్తే
Tollywood1
Ravi Kiran
|

Updated on: Oct 08, 2024 | 1:30 PM

Share

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘జోష్’ మూవీ గుర్తుందా.? ఈ సినిమా ద్వారా అలనాటి తార రాధ కుమార్తె కార్తీక నాయర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. అయితేనేం తెలుగులో ఈమెకు మాత్రం అదృష్టం అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. తొలి చిత్రం హిట్ అయినప్పటికీ.. పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తమిళంలో ‘కో’ అనే చిత్రంతో కోలివుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అక్కడ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలై.. ఇక్కడా పెద్ద హిట్ సాధించింది. హీరోయిన్ కార్తీకకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే మలయాళం ఇండస్ట్రీకి ‘మకరమంజు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి. ఈ మూవీ సక్సెస్ సాధించినా.. ఆ ఇండస్ట్రీలోనూ ఎక్కువ ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయింది ఈ అందాల భామ. ఇక తెలుగులో ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో నటించింది.

వెండితెరపై అచ్చిరాక.. బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కార్తీక నాయర్. 2017లో ‘ఆరంభ్’ అనే హిందీ సీరియల్‌లో నటించింది. ఇక ఇందులో కార్తీక నటనకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందాయి. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ భామ.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కేరళలో నివాసముంటోంది. అక్కడ యూడీఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు(udshotels) డైరెక్టర్‌గా పని చేస్తోంది. అలాగే 2023, నవంబర్‌లో రోహిత్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లాడింది కార్తీక నాయర్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..