Ustaad Bhagat Singh Pre Release Event: గ్రాండ్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. ఇప్పిటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మేనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తమన్ బీజీఎం స్కోర్ అందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది..
LIVE NEWS & UPDATES
-
అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు : పవన్ కళ్యాణ్
నా గుండెల్లో స్థానం ఉన్న మీ అందరికి.. ఈవెంట్‌ను టీవీలో చూస్తున్న తెలుగు ప్రజలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు మీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చిన వారందరికీ.. సుమ గారు మాట్లాడుతూ.. అప్పట్లో అంటూ మెల్లగా నన్ను బీసీ కాలానికి నెట్టిస్తున్నారు. ఇటీవలే ఓజీ సినిమా వచ్చిన విషయం మర్చిపోయారు. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను వెనక్కి నెట్టేస్తున్నారు. ఈ సందర్భంగా బల్ల గుద్ది చెప్తున్నా.. సినిమా నాకు చాలా ఇష్టం.. నాకు అన్నం పెట్టింది సినిమా.. ఇప్పుడు ప్రజలకు సేవలు అందించేలా చేసింది సినిమా.. సినిమా ఎలా ఆడాలి, కలెక్షన్స్ ఎంత అన్నది నేనెప్పుడూ అడగలేదు.. తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ వరకు వెళ్ళింది. అలాంటి తెలుగు సినిమాల్లో నేను చిన్నపాటి భాగం అవ్వడం ఆనందంగా ఉంది. సినిమా బాగా చేయాలనీ అనుకుంటా కానీ రిజెల్ట్ మన చేతిలో ఉండదు. నాకు ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు పక్కన ఉంటే నేను హీరో అని మర్చిపోతాను. అలాగే పెద్ది మన రామ్ చరణ్ ట్రైలర్ గురించి ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే బుచ్చిబాబుకు నా ధన్యవాదాలు.
సినిమా ఎప్పుడు అద్భుతంగా రావాలి అనుకుంటాం.. కొన్నిసార్లు సినిమాల విషయం ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంటాం.. అవన్నీ దాటుకొని సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా మాకు తిండి పెడుతుంది. సినిమా పోవాలని ఎవ్వరూ సినిమా చేయరు. ఒక్కసారి నేను దర్శకుడిని నమ్మితే నేను ఏది పట్టించుకోని బ్లైండ్ గా సినిమా చేసేస్తా.. సినిమా అనుకున్నప్పుడు మధ్యలో కోవిడ్ వచ్చింది. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళా.. ఈ సినిమా కు డేట్స్ ఇవ్వలేకపోయా.. ఒక 40, 45 రోజుల్లోనే సినిమా పూర్తి చేసాం.. రోజుకు రెండు మూడు గంటలే చేశాం.. హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. హరీష్ నాతో డాన్స్ చేసేలా చేశాడు.. దినేష్ మాస్టర్ నాతో డాన్స్ చేయించాడు. దేవీ శ్రీ లేకపోతే సినిమాకు ఇంత ఊపు వచ్చేది కాదు. దేవీ శ్రీ సినిమాల్లోకి రాక ముందు మొదటి ప్రైవేట్ ఆల్బమ్ నేనే రిలీజ్ చేశా.. శ్రీలీలకు ఈ సినిమాలో డాన్స్ తక్కువ ఉన్నా యాక్టింగ్ బాగా చేసింది. శ్రీలీల చేసిన సినిమాల్లో ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్ర చేసింది. అలాగే రాశీ ఖన్నా కథ కూడా వినకుండా నేను చేస్తున్నానని సినిమా చేశా అని చెప్పింది. ఆమె కూడా అద్భుతంగా చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాంతీయత ఉండదు.. సినిమాలు ఎల్లలు ఉండవు. హరీష్ మన నెల నుంచి పుట్టిన దర్శకుడు. నాకు గుర్రపు స్వారీ రాదు.. గబ్బర్ సింగ్ సినిమా కోసం నాతో చేయించాడు. హరీష్ నా నుంచి చాలా ఆశిస్తాడు. నాతో అన్ని చేయించుకున్నాడు. హరీష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. హరీష్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా.. ఇచ్చి పడేసే గోత్రం నాది కాదు హరీష్‌ది.. నేను దెబ్బలు పడితే తీసుకుంటా.. మనోడు ఇచ్చిపడేస్తాడు. నా సినిమాను చూడండి అని చెప్పుకోవడం నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాదిస్తుందని నేను కోరుకుంటున్నా.. మా నుంచి తప్పు లేకుండా ఈ సినిమా చేశాం.. ఇక రిజెల్ట్ మీ చేతిలో ఉంది. ఈ సినిమాను నేను కూడా మార్చ్ 19న ఎదురుచూస్తా.. సినిమాను నా నుంచి తీసేయలేరు. నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది సినిమా అనేది. దక్షణ భారతదేశంలో సినిమా అనేది చాలా కీలకం.. సినిమాను తెలుగు ప్రేక్షకుల నుంచి కానీ మన దేశం నుంచి కానీ తీసేయలేం. అందరూ బాగుండాలని కోరుకుంటా.. అందరు హీరోల సినిమాలు మంచిగా ఆడాలి అని కోరుకుంటా.. టికెట్ రేట్స్ అనేది నా సినిమాలు తక్కువ ఇచ్చుకున్నా.. మిగతా వారికి ఎక్కువ రేట్లు వచ్చేలా చూశాం.. అందరూ బాగుండాలని కోరుకుంటాం.. నా సినిమా కలెక్షన్ అన్ని దాటేయాలి అలాంటివి నాకు నచ్చవు.. ఫ్యాన్ వార్స్ అనేవి నాకు నచ్చవు. అందరు హీరోలను గౌరవిస్తాను. ఎవరు విజయం సాధించినా నేను గౌరవిస్తాను. లో టైం లో ఉన్నప్పుడు బీమ్లా నాయక్ సినిమాలు అభిమానులు నిలబడిన విధానం నేను మర్చిపోలేను. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. మీకు నాకు రెండు గుండెల దూరం అంతే.. నేను సినిమా చేసినప్పుడు ఒక్కటే కోరుకుంటా ఎంటటైన్మెంట్ ఉండాలి.. చిన్నపాటి సామజిక అవగాహనా, దేశం మీద భక్తి ఉండాలి అని నేను అనుకుంటా.. ఉస్తాద్ భగత్ సింగ్ అలా తెరకెక్కించాడు హరీష్ శంకర్. నా తొలిప్రేమ సినిమా హిట్ అయినప్పుడు అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో నాకు తెలియదు. అలాగే ఓజీ హిట్ అయినప్పుడు కూడా నాకు తెలియదు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ తక్కువ సమయంలోనే చేశారు.. దాంతో నాకు రాబోయే సినిమాల విషయంలో దైర్యం వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా.. సినిమాలో డైలాగ్ చెప్పను కానీ దాన్ని మార్చి చెప్తా.. “మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం”.
-
నిలబడి తన మ్యాషప్ వీడియో చూసిన పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ మ్యాషప్ వీడియో ప్లే అవుతుండగా పవన్ కళ్యాణ్ నిలబడి చూశారు. పవన్ కళ్యాణ్ స్టేజ్ పైకి వస్తుండగా సుమ పవన్ వీడియో ఉంది అని చెప్పడంతో అక్కడే ఆగి నిలబడి చూశారు పవన్ కళ్యాణ్..
-
-
ఈ సారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది: హరీష్ శంకర్
మీ అందరికి తెలుసు సినిమా అనుకున్నదానికంటే కొంచం లెట్ అయ్యింది.. ఫస్ట్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ కథ అనుకున్నా తర్వాత కథను మార్చాం.. సినిమా లెట్ అవ్వడానికి నేనే కారణం.. సినిమా స్పీడ్ గా చేయడానికి నేనే కారణం. నిర్మాతలు నన్ను బుజాల మీద మోశారు.. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. రోజుకు 1200మందితో షూటింగ్ చేశాం.. నిర్మాతలు చాలా సహకరించారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ నాకు హీరో అయితే తెర వెనక దేవీ శ్రీ ప్రసాద్ నా హీరో.. దేవీ బిజీగా ఉండటంతో థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. శ్రీలీల మాములు కాదు మీ గోల.. శ్రీలీల మంచి డాన్సర్.. ఎలాగో డాన్స్ చూశారు కాబట్టి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు కళ్యాణ్ గారినిపెట్టి ఓ ఐటెం సాంగ్ చేసే ఉద్దేశం నాకు లేదు.. కానీ కళ్యాణ్ గారి డాన్స్ సినిమాలో ఉంటుంది. రెండు పాటల్లో కళ్యాణ్ గారు డాన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ చూడాలంటే మార్చ్ 19న థియేటర్స్ కు రండి. నేను లో లో ఉన్నప్పుడు దేవుడిలాగా నా పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి త్వరగా షూటింగ్ షార్ట్ చేసుకో అని చెప్పారు. దాంతో నా లోలు అన్ని పోయాయి. గుండె లోపల పవన్ కళ్యాణే.. గుండె పైన పవన్ కళ్యాణే .. నా గుండె దైర్యం పవన్ కళ్యాణే. గబ్బర్ సింగ్ సినిమా నిన్నకాక మొన్న జరిగినట్టు ఉంది. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది.
-
పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా నేర్చుకున్నా: శ్రీలీల
దర్శకుడు హరీష్ శంకర్ చాలా ముక్కుసూటిగా ఉంటారు అనుకున్నాను.. ఆయనతో పని చేసినప్పుడు అర్ధమైంది.. ఆయన ముక్కుసూటి తనంలో నిజాయితీ ఉంటుంది. ఈ సినిమాను ఓ యజ్ఞంలా చేశారు హరీష్. డీఎస్పీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పవర్ స్టార్, పీపుల్ స్టార్.. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు. ఎక్కడికివెళ్ళినా నన్ను పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు అని అడుగుతుంటారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా నేర్చుకున్నా.. ముఖ్యంగా పాజిటివ్ గా ఉండటం, మనతో పాటు మన పక్కనున్నవారిని కూడా పట్టించుకోవడం, ముఖ్యంగా నేచర్ ను చూసుకోవడం నేర్చుకున్నా.. ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది చేసేద్దాం అని శ్రీలీల తెలిపింది.
-
పవన్ కళ్యాణ్ ఒక మనిషిగా నాకు స్పూర్తిని ఇచ్చారు: రాశీ ఖన్నా
కెరీర్ బిగినింగ్ నుండి చాలా సార్లు చెప్పాను.. పవన్ సార్ తో పని చేయాలనీ.. ఇప్పుడు అది కుదిరింది. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారు. జనం గురించే ఆలోచిస్తారు. తక్కువ మాట్లాడుతారు.. కానీ ప్రతిఒక్క మాటలో విలువ ఉంటుంది. ఒక మనిషిగా నాకు స్పూర్తిని ఇచ్చారు. హరీష్ ఈ సినిమా కోసం చాలాకష్టపడ్డాడు. శ్రీలీలస్వీట్ హార్ట్, పవన్ కళ్యాణ్
-
-
శ్రీలీల నన్ను డామినేట్ చేస్తుంది: పవన్
శ్రీలీల నన్ను డామినేట్ చేస్తుందని హరీష్ కు చెప్పి ఆమెను డాన్స్ చేయించలేదు. నేనే కనిపించాలని అని శ్రీలీలతో డాన్స్ చేయించలేదు అని సరదాగా అన్నారు పవన్ కళ్యాణ్
-
నేను జీవితంలో పిచ్చిగా అబిమానించింది అతన్నే..
మైకేల్ జాన్సన్ డాన్స్ తో నా పాటను ఎడిట్ చేయడం చాలా పాపం.. నేను మైకేల్ జాక్సన్ అభిమానిని.. నేను జీవితంలో పిచ్చిగా అబిమానించింది మైకేల్ జాక్సన్ న్నే .. నేను ఈ మాత్రం డాన్స్ చేస్తున్నా అంటే కారణం ఆయనే.. ఆయన చనిపోయినప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నేను సినిమాల్లోకి రావాలి అనే ఆలోచన వచ్చింది మైకేల్ జాక్సన్ ను చూసినపుడే అని పవన్ కళ్యాణ్ అన్నారు.
-
నా ఫాన్స్ కోప్పడతారన్న భయంతో డాన్స్ చేశాను: పవన్ కళ్యాణ్
ఇచ్చి పడేసే గోత్రం హరీష్ శంకర్ కు ఇచ్చేయొచ్చు.. నేను డాన్స్ చేయను అన్నప్పుడు నాతో డాన్స్ చేయించాడు. లైఫ్ లో డాన్స్ చేయకూడదు అనుకున్నా.. నా ఫాన్స్ కోప్పడతారన్న భయంతో చేశాను.. హరీష్ శంకర్ ఏదైనా అనుకుంటే చేసేస్తాడు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
-
సుమకు అదిరిపోయే పంచులు వేసిన పవన్ కళ్యాణ్..
అప్పట్లో మీ ప్యాషన్ ఏంటి అని సుమ అడగబోతుండగా.. అంటే ఎప్పుడండీ.. 1940,60లోనా.. అంటూ పవన్ చమత్కరించారు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే.. రాజ్ కపూర్ గారితో నటించేటప్పుడు, నేను ఎస్వీ రంగారావుగారు, నేను కన్నాంబగారు, నేను ఎన్టీఆర్ గారు కలిసి నటించేటప్పుడూ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మొన్నే కదండీ మొదలుపెట్టింది.. అంటూ నవ్వులు పూయించారు పవన్ కళ్యాణ్..
-
రోజుమొత్తంలో ఒక రెండు గంటలు పుస్తకాలు చదువుతాను: పవన్ కళ్యాణ్
రోజుకు కనీసం ఎదో ఒక పుస్తకం చదువుతాను.. రోజుమొత్తంలో ఒక రెండు గంటలు చదువుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు
-
డైలాగ్స్ మర్చిపోయాను..: రాశీ ఖన్నా
పవన్ కళ్యాణ్ గారిని మొదటిసారి కలిసినప్పుడు ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు.. నేను డైలాగ్స్ మర్చిపోయాను అని చెప్పింది రాశీ ఖన్నా
-
శ్రీలీల మనసు గెలుచుకోవాలంటే
శ్రీలీల మనసు గెలుచుకోవాలంటే.. మంచి మనసు, మంచి వ్యక్తి అయ్యుండాలి అని శ్రీలీల తెలిపింది.
-
తొలిప్రేమ సినిమా చూసి నేను దర్శకుడిని అవ్వాలని ఫిక్స్ : బుచ్చిబాబు
హరీష్ శంకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం.. నా ఫీలింగ్స్ అన్ని హరీష్ గారితో షేర్ చేసుకుంటాను. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తారు. నేను పుట్టింది పిఠాపురంలో.. మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా చూసి నేను దర్శకుడిని అవ్వాలని ఫిక్స్ అయ్యాను.. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు హరీష్ శంకర్ చాలా గౌరవం ఇస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటే చరణ్ గారు వైబ్ లో ఉంటారు. చిరంజీవి గారి నుంచి ఎంత నేర్చుకున్నానో .. పవన్ కళ్యాణ్ గారి నుంచి వందరెట్లు నేర్చుకున్నా అని చరణ్ గారు అన్నారు అని చెప్పారు బుచ్చిబాబు.
-
పవన్ కళ్ళకు నమస్కరించిన బుచ్చిబాబు
పవన్ కళ్ళకు నమస్కరించిన పెద్ది మూవీ దర్శకుడు బుచ్చిబాబు
-
వైట్ అండ్ వైట్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
వైట్ అండ్ వైట్ డ్రసింగ్ లో ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్..
-
పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ
మాస్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
-
బద్రి డైలాగ్ చెప్పిన రాశి ఖన్నా
నువ్వు నందా అయితే నేను బద్రి బద్రి నాద్ డైలాగ్ చెప్పిన రాశీ ఖన్నా..
-
పవర్ స్టార్ డైలాగ్ చెప్పిన శ్రీలీల
నాకు కొచం తిక్కుంది.. దానికి ఒక లెక్కుంది డైలాగ్ చెప్పిన శ్రీలీల
-
ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పెద్ది సినిమా దర్శకుడు బుచ్చి బాబు..
-
దేఖ్ లేంగే సాలా నాకు చాలా నచ్చిన పాట: భాస్కర్ బట్ల
దేఖ్ లేంగే సాలా నాకు చాలా నచ్చిన పాట అని అన్నారు భాస్కర్ బట్ల. హరీష్ తో పని చేస్తే.. పని చేసినట్టే ఉండదు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని భాస్కర్ బట్ల అన్నారు.
-
పవన్ కళ్యాణ్ గురించి రాస్తుంటే ప్రతి అక్షరానికి పూనకం వస్తుంది: కాసర్ల శ్యామ్
పవన్ కళ్యాణ్ గారికోసం డాన్స్ నెంబర్ రాశాను.. పవన్ కళ్యాణ్ గురించి రాస్తుంటే ప్రతి అక్షరానికి పూనకం వస్తుంది అని కాసర్ల శ్యామ్ అన్నారు. అలాగే హరీష్ గారితో పనిచేస్తే తెలియని ఉత్సహం వస్తుంది..
-
ఎంట్రీ ఇచ్చిన అందాల రాశీ ఖన్నా..
అదిరిపోయే లుక్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాశీ ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. ..
-
పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో అదరగొట్టిన ఫ్యాన్స్..
పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్స్ తో రచ్చ రచ్చ చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్..
-
ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల
ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ శ్రీలీల..
-
ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, కాసర్ల శ్యామ్, భాస్కర్ బట్ల
-
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం : సుమ
యాంకరింగ్ మొదలు పెట్టించిన సుమ.. ఎంట్రీ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ తో అదరగొట్టిన సుమ.. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం అంటూ సుమ ఎంట్రీ
-
అభిమానులతో ముచ్చటించిన అరియనా
పవన్ కళ్యాణ్ అభిమానులతో ముచ్చటించిన అరియనా..
-
భారీగా చేసుకున్న అభిమానులు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
-
మరికాసేపట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
మరికాసేపట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే భారీగా అభిమానులు ఈవెంట్ కు హాజరయ్యారు.
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
