AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఛీ..ఛీ.. పనిమనిషి చేసిన పాడుపని..! ఇంటిల్లిపాదికి కాలేయ వ్యాధి.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..

ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది రీనా అనే మహిళ. గత 8 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే పని చేస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న రీనాను ఆ కుటుంబం ఎంతగానో నమ్మింది. ఇదిలా ఉండగా, ఆ కుటుంబ సభ్యులు కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన కుటుంబ సభ్యులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఇంట్లోని పలుచోట్ల సీసీ కెమెరాలు అమర్చారు.

Viral News: ఛీ..ఛీ.. పనిమనిషి చేసిన పాడుపని..! ఇంటిల్లిపాదికి కాలేయ వ్యాధి.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..
Revenge
Jyothi Gadda
|

Updated on: Oct 18, 2024 | 12:11 PM

Share

యూపీలోని ఘజియాబాద్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పనిమనిషి పనిచేసే ఇంట్లో కుటుంబమంతా క్రమంగా అనారోగ్యం పాలవుతోంది. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు యజమాని ఇంట్లో పలుచోట్ల కెమెరాలు అమర్చాడు. ఈ కెమెరా ద్వారానే అతని ఇంట్లో పనిమనిషి రీనా చేసిన జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి రోజూ ఆ ఇంట్లో చేసే చపాతీ పిండిలో మూత్రం కలుపుతూ కెమెరాకు చిక్కింది. వెంటనే పోలీసులకు కంప్లైట్‌ చేయటంతో పనిమనిషిని అరెస్టు చేశారు. విచారణలో ఆమె అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.

యూపీలోని ఘజియాబాద్‌లోని థానా క్రాసింగ్ రిపబ్లిక్ ఏరియాలోని సొసైటీలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది రీనా అనే మహిళ. గత 8 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే పని చేస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న రీనాను ఆ కుటుంబం ఎంతగానో నమ్మింది. ఇదిలా ఉండగా, ఆ కుటుంబ సభ్యులు కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన కుటుంబ సభ్యులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఇంట్లోని పలుచోట్ల సీసీ కెమెరాలు అమర్చారు. సీసీటీవీ చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వారు భయపడిన దానికంటే దారుణంగా ప్రవర్తించింది రీనా. వారికి వండిపెడుతున్న చపాతీ పిండిలో రీనా మూత్రం కలుపుతూ కెమెరాలో కనిపించింది. అది చూసిన కుటుంబం ఒక్కసారిగా కుదేలయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

ఆహారంలో మూత్రం కలిపిన రీనాను పోలీసులు అదుపులోకి అరెస్టు చేశారు. విచారణలో, రీనా తను చేసిన పనికి కారణాన్ని చెప్పింది. మొదట రీనా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసినప్పటికీ ఆ తర్వాత సీసీటీవీ వీడియోను చూపించగా, నేరం ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. బాస్ తిట్టడం వల్లే ఇదంతా చేశానని రీనా చెప్పింది. ఆమెను తన ఓనర్‌ ఎప్పుడూ తిడుతూ ఉండేవాడని, చిన్న విషయాలకే రాద్దాంతం చేసేవాడని చెప్పింది. అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేశానని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..