AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మలేషియన్‌ వీధుల్లో రజనీకాంత్‌ ఫ్యాన్స్‌.. ! ఏం చేశారో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తలైవాగా పేరుగాంచిన ఈ సూపర్‌ స్టార్‌ పాపులారిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అమెరికా, యూకే సహా డజన్ల కొద్దీ దేశాల్లో రజనీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో, కొంతమంది విదేశీ మహిళలు రజనీకాంత్ తన సూపర్ హిట్ తమిళ పాటలో అదే శైలిలో డ్యాన్స్ చేస్తూ ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్నారు.

Watch: మలేషియన్‌ వీధుల్లో రజనీకాంత్‌ ఫ్యాన్స్‌.. ! ఏం చేశారో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Foreign Girls Dance
Jyothi Gadda
|

Updated on: Oct 18, 2024 | 10:42 AM

Share

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. అలాగే, ప్రజల్లో ఆయనకున్న క్రేజ్‌ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీ వాకింగ్ స్టైల్ యాటిట్యూడ్ అంటే ఎంతో మంది అభిమానులు ఇష్టపడతారు. అలాగే, కొన్ని ప్రాంతాల ప్రజలు రజనీకాంత్‌ను దేవుడిలా పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో అతని ఆలయాలు కూడా నిర్మించబడ్డాయి. తలైవాగా పేరుగాంచిన ఈ సూపర్‌ స్టార్‌ పాపులారిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అమెరికా, యూకే సహా డజన్ల కొద్దీ దేశాల్లో రజనీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో, కొంతమంది విదేశీ మహిళలు రజనీకాంత్ తన సూపర్ హిట్ తమిళ పాటలో అదే శైలిలో డ్యాన్స్ చేస్తూ ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్నారు.

రజనీకాంత్‌పై విదేశీ అమ్మాయిలకు మక్కువ. మలేషియాలోని స్థానిక డ్యాన్సర్ అమ్మాయిలు దక్షిణ భారత శైలిలో ఆకుపచ్చ, పసుపుపచ్చ చీరలు ధరించి డ్యాన్స్‌ చేస్తున్నారు. నేపథ్యంలో రజనీకాంత్ సినిమాలోని డ్యాన్స్ సాంగ్ వినిపిస్తోంది. దీనిపై అమ్మాయిలంతా ఫాస్ట్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ల డ్యాన్స్ ఎంత ఫాస్ట్ గా ఉందంటే.. ఓ సౌత్ సినిమాలోని సాంగ్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇందులో లీడింగ్‌లో ఉన్న మహిళ, ఇతర డ్యాన్సర్‌ల కంటే కొంచెం లావుగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె వేసిన డ్యాన్స్‌ స్టెప్పులు, భావ వ్యక్తీకరణలు మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

విదేశీ డ్యాన్సర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @Wiwin Ariantika ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనికి 60 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ రీల్‌కి 5 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. నెటిజన్లు దీన్ని రజనీకి ప్రేమగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది వీరి డ్యాన్స్‌పై ప్రశంసలు కుమ్మరించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..