Watch Video: బిల్డింగ్‌ పైనుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! వీడియో

ఓ యువతి ఉన్నట్టుండి పెద్ద భవనంపై నుంచి కింద పడిపోయింది. అయితే ఆమె నేరుగా కింద పడిపోకుండా దాని కింద ఉన్న టెర్రస్ పై పడిపోయింది. తీవ్రగాయాల పాలైన యువతి కదలలేని స్థితిలో పడి ఉండటంతో చుట్టు పక్కల వారు గమనించి..

Watch Video: బిల్డింగ్‌ పైనుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! వీడియో
Girl Jumps Off Multi Storey Building
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2024 | 7:03 PM

భోపాల్‌, అక్టోబర్ 17: ఒక యువతి బిల్డింగ్‌ పైనుంచి అమాంతం కిందకి దూకేసింది. అయితే ఆమె నేరుగా కింద పడిపోకుండా కింద ఉన్న టెర్రస్‌పై పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆ యువతిని అక్కడ నుంచి కిందకు దించి కాపాడారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విజయ్ నగర్ ప్రాంతంలో గోల్డెన్ గేట్ సమీపంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అంతే బహుళ అంతస్తులున్న ఓ బిల్డింగ్‌ పైనుంచి అమాంతం కిందకి దూకేసింది. అయితే ఆమె ఆ భవనం కింద ఉన్న పైకప్పు టెర్రస్‌పై ఆమె పడింది. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు పెద్ద ఎత్తున గుమి కూడారు. యువతి భవనంపై నుంచి దూకిన తర్వాత కింది అంతస్తు పైకప్పుపై పడిపోయింది. స్థానికులు అతి కష్టం మీద అక్కడికి చేరుకుని, జాగ్రత్తగా కిందకు దించారు. టెర్రస్‌ పడిపోయిన తర్వాత యువతి కదలలేని స్థితిలో ఉండటం గమనించిన స్థానికులు చేతులతో పైకెత్తి కిందికి దించారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యువతి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడం కోసం బిల్డింగ్‌ పైనుంచి దూకిందా లేదా ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడిపోయిందా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటనపై ఆరా తీయడం ప్రారంభించారు. స్థానికులు ఆ యువతిని రక్షించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..