Watch Video: ట్రాఫిక్ పోలీస్‌ను కారుతో ఢీ కొట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో వైరల్
నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారును ఆపమన్నందుకు.. ఓ కారు డ్రైవర్ నానాహంగామా చేశాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసును కారుతో ఢీ కొట్టి, అదే కారుతో వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో..
గ్వాలియర్, అక్టోబర్ 16: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడిపోయాడు. అయితే కారు డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా.. అలాగే సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. కొంతదూరం పోయాక ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు నుంచి జారి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం ఉదయం మాధవ్ నగర్ జంక్షన్ వద్ద ఏఎస్‌ఐ సతీషన్ సుధాకరన్, హోంగార్డు రాకేష్‌తో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్రిజేంద్ర సింగ్ విధుల్లో ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో నంబర్ ప్లేట్ లేని ఎర్రటి కారు వంతెన వైపు నుంచి రావడాన్ని గమనించిన కానిస్టేబుల్ బ్రిజేంద్ర కారును ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే కారు డ్రైవర్ మరింత వేగం పెంచి కానిస్టేబుల్ బ్రిజేంద్రను ఢీకొట్టడంతో.. అతడు ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినా కారును డ్రైవర్ ఆపలేదు. దీంతో బానెట్‌పై పడిన కానిస్టేబుల్‌ను 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. మాధవ్ నగర్ కూడలిలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత హరిశంకర్ పురం కూడలి వద్ద డ్రైవర్ ఒక్కసారిగా మలుపు తిప్పడంతో బ్రిజేంద్ర సింగ్ కారుపై నుంచి కిందపడటంతో అతడి తల నేలకు ఢీకొని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. సిసిటివి ఫుటేజీ ఆధారంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని గ్వాలియర్ ఎస్పీ ధర్మవీర్ సింగ్ పోలీసులను ఆదేశించారు. కాగా గత కొన్ని రోజుల క్రితం ఇండోర్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగింది. నిందితుడు డ్రైవర్ కూడా గ్వాలియర్‌కు చెందినవాడే కావడం విశేషం. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.