AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodya: అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించిన ఇజ్రాయెల్ రాయబారి.. దర్శనం అనంతరం ఏమన్నారంటే

కోట్లాది హిందువుల కల నెరవేరుతూ రామయ్య జన్మించిన భూమిలో రామయ్య ఆలయం నిర్మాణం జరుపుకుంది. గర్భ గుడిలో కొలువుదీరిన బాల రామయ్యను దర్శించుకోవానికి హిందువులు మాత్రమే కాదు రామయ్య భక్తులు దేశ విదేశాల నుంచి వస్తున్నారు. తాజాగా మన దేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ రామ మందిరాన్ని సందర్శించారు. బాల రామయ్యను దర్శించుకున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రూవెన్ అజార్ హిందూ మత విశ్వాసం.. అయోధ్య ప్రాముఖ్యత గురించి అనేక విషయాలను తెలియజేశారు.

Ayodya: అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించిన ఇజ్రాయెల్ రాయబారి.. దర్శనం అనంతరం ఏమన్నారంటే
Reuven Azar At The Ram Temple In Ayodhya On Wednesday
Surya Kala
|

Updated on: Oct 17, 2024 | 7:42 PM

Share

భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ బుధవారం రామ జన్మ భూమి అయోధ్యలో అడుగు పెట్టారు. రామ మందిరాన్ని సందర్శించారు. బాలా రామయ్యను దర్శించుకున్న తర్వాత ఆలయం బయట ఆయన మాట్లాడుతూ రామాలయం గురించి.. హిందూ ధర్మం గురించి అనేక విషయాలను మాట్లాడారు. బాల రామయ్య దర్శనం తనను ఎంతో కదిలించిందని చెప్పారు. అయోధ్యలోని ఈ అద్భుతమైన రామయ్య ఆలయాన్ని సందర్శించడం తనకు నిజంగా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఆలయానికి రోజూ వస్తున్న భక్తులను చూస్తే తనకు ఎంతో ఆశ్చర్య పరిచిందని..భక్తుల సంఖ్య చూసి చలించిపోయానని చెప్పారు. ఇది హిందూ విశ్వాసానికి.. ఈ ప్రదేశం ప్రాముఖ్యతకు నిదర్శనం ”అని చెప్పారు.

“భారతదేశ ప్రజల వలెనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ప్రాచీన మతం, సంప్రదాయం, వారసత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. మేము మా వారసత్వం గురించి ఎలా గర్విస్తున్నామో.. అదే విషయంగా హిందూ సనాతన ధర్మం వారసత్వం గురించి హిందువులు కూడా గర్వపడుతున్నారన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం.. ఎందుకంటే హిందువుల భక్తి వారికి బలాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. అందుకనే తాను అయోధ్య నగరాన్ని.. రామాలయం సందర్శించే సమయంలో తన మనసుని కదిలించిన ఘటన భక్తులకు రాముడిపై భక్తులకు ఉన్న విశ్వాసం అని చెప్పారు. రాముడి దర్శనానికి వచ్చిన భక్తులకు రాముడి పట్ల ఉన్న భక్తీ విశ్వాసం చూస్తే తనకు హిందూ ధర్మం పట్ల మరింత గౌరవం కలిగిందని చెప్పారు.

రూవెన్ అజార్ మంగళవారం సాయంత్రం అయోధ్యకు మంగళవారం చేరుకున్నారని అధికారులు చెప్పారు. మర్నాడు అంటే బుధవారం ఉదయం బాల రామయ్య ఆలయాన్ని సందర్శించారు. తర్వాత పొరుగున ఉన్న బస్తీ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్ళారు.,

ఇవి కూడా చదవండి

లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో రూవెన్ అజార్ సమావేశమయ్యారు. ఇరువురూ ఇజ్రాయెల్ భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ” గురించి చర్చించినట్లు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తో బంధం గురించి చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని పోలీసు ఆధునీకరణ, యాంటీ-డ్రోన్ సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవశక్తి లభ్యత వంటి విషయాల్లో ఇజ్రాయెల్ నైపుణ్యాన్ని ఉపయోగించడం సహా అనేక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 5,000 మందికి పైగా ప్రజలు ఇజ్రాయెల్‌లో “నైపుణ్యం కలిగిన మానవశక్తి”గా పనిచేస్తున్నారు. అనేకాదు బుందేల్‌ఖండ్‌, ఆగ్రాల్లో భూగర్భ జలాలు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ నుంచి సహాయం తీసుకుంటోంది.

UP ప్రభుత్వం ఇజ్రాయెలీ సాంకేతికతను, పోలీసు ఆధునీకరణ, యాంటీ-డ్రోన్ టెక్నాలజీలో నైపుణ్యాన్ని ఉపయోగించడంలో ఆసక్తిని కూడా వ్యక్తం చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగనున్న మహాకుంభమేళాను ఏర్పాట్లు చేయడానికి సురక్షితంగా ఉండే విధంగా ఇజ్రాయెల్ సాంకేతికతను ముఖ్యమంత్రి యోగి రూవెన్ అజార్ ను కోరారు. సిఎం కోరికను రూవెన్ అజార్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..