AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Firecrackers: దీపావళి రోజు పటాకులు కాలుస్తుంటే గాయపడితే.. ఎలా ప్రథమ చికిత్స చేయాలో తెలుసా..

దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి అంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే బాణసంచా కాల్చే పండగ. అయితే కొన్నిసార్లు పటాకులు పేల్చే ఉత్సాహంలో అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడతాం. దీపావళి రోజున మీరు లేదా మీ సమీపంలో ఉన్నవారు పటాకులు పేల్చిన సమయంలో కాలిపోతే ఏమి చేయాలి ? ఏమి చేయకూడదు? తెలుసుకోవాలి. అంతేకాదు బాణా సంచా వలన గాయాలు అయితే ఎటువంటి ప్రథమ చికిత్స అందించాలో తప్పని సరిగా ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి.

Firecrackers: దీపావళి రోజు పటాకులు కాలుస్తుంటే గాయపడితే.. ఎలా ప్రథమ చికిత్స చేయాలో తెలుసా..
Firecrackers On DeepavaliImage Credit source: social media
Surya Kala
|

Updated on: Oct 17, 2024 | 6:36 PM

Share

దీపావళి పండగ రోజున చీకట్లను తరముతూ వెలుగులు నింపుతూ దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా పటాకులు పేలుస్తారు. ఒకొక్కసారి అనుకొన్ని విధంగా బాణాసంచా వలన కాలి గాయాలు అయ్యే కాలిన ప్రమాదం కూడా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కోసారి గాయాల బారిన పడుతూ ఉంటారు. బాణసంచాలో ఉపయోగించే రసాయనాల వలన వేడి. గాయాల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కనుక.. ఈ పటాకులు కాల్చడం వల్ల పిల్లలు గాయపడితే ఆ బాధ మరింత అధికంగా ఉంటుంది. పటాకులు పేల్చేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఒకొక్కసారి ప్రమాదాల బారిన పడుతూనే ఉంటారు. ఈ నేపధ్యంలో దీపావళి సమయంలో పటాకుల వలన గాయాలు అయితే చికిత్స చేయడానికి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..

వెంటనే దుస్తులు తొలగించండి:

పటాకులు పేల్చే సమయంలో మంటలు చెలరేగి.. ఎవరినైనా తాకితే.. వెంటనే బట్టలు, నగలు, బెల్టులు అన్నీ తీసేయండి. అవి కాలిన చర్మానికి అతుక్కునే అవకాశం ఉంది. కనుక వీలైనంత త్వరగా క్షతగాత్రుల శరీరం నుంచి బట్టలు సహా నగలు అన్నిటినీ తొలగించండి. అయితే కాలిన ప్రదేశంలో దుస్తులు అతుక్కుపోయి ఉంటే.. అప్పుడు మాత్రం సొంతంగా తొలగించడానికి ప్రయత్నించవద్దు.

చల్లటి నీటితో శుభ్రం చేయాలి

ఎవరైనా పటాకుల వలన కాలిన గాయంతో బాధపడుతుంటే.. అలా గాయపడిన ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగాలి. అయితే కాలిన ప్రాంతానికి ఐస్ ని అప్లై చేయవద్దు. ఇలా ఐస్ ని అప్లై చేయడం వలన కాలిన గాయం నొప్పిని మరింత తీవ్రతరం అవుతుంది. అందుకు బదులుగా కుళాయి కింద కాలిన ప్రాంతాన్ని ఉంచండి. మంటను చల్లబరచడం వల్ల నొప్పి, వాపు, గాయం ప్రమాదం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

గాయపడిన ప్రాంతంలో గాజు గుడ్డతో కట్టు కట్టండి..

గాయపడిన ప్రదేశానికి కట్టు కట్టండి. అయితే గాయపడిన ప్రదేశంలో కట్టును కొంచెం వదులుగా చుట్టండి. గాయం కప్పబడి ఉంటే.. ఆ గాయం త్వరగా నయం అవుతుంది.

మాయిశ్చరైజర్ లోషన్ రాయండి:

కాలిన ప్రభావిత ప్రాంతంపై మాయిశ్చరైజింగ్ లోషన్‌ను రాయండి. ఇది చర్మం పొడిబారకుండా చేస్తుంది. అంతేకాదు కాలిన ప్రదేశంలో బొబ్బలు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే వైద్యుడిని సంప్రదించకుండా ఎటువంటి క్రీమ్, లోషన్ లేదా మెడిసిన్ ను ఉపయోగించవద్దు. అలాగే నొప్పి నివారణ కోసం డాక్టర్ సూచించిన తర్వాతే మందులు వాడాలి.

కాలిన చేయి లేదా కాలు ఎత్తులో ఉంచండి

కాలిన భాగాన్ని సాధారణ స్థాయి కంటే కొంచెం ఎత్తులో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో వాపు తగ్గుతుంది. నీరు చేరదు. చేతులు, కాళ్ళను వీలైనంత నిటారుగా ఎత్తులో పెట్టుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)