TB Disease: TB రోగులకు శుభవార్త.. కొత్త ఎక్స్‌రే పరికరం సృష్టి.. ఇంటి దగ్గరే పరీక్షించుకునే అవకాశం

భారతదేశం అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అనేక దేశాలకు దీటుగా అభివృద్ధి వైపు పయనిస్తుంది. అయినప్పటికీ కొన్ని విషయాలు భారత దేశానికి సమస్యగా మారుతూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి టీబీ వ్యాధి. అవును TB వ్యాధి ఇప్పటికీ మన దేశంలో పెద్ద సమస్యగా ఉంది. టీబీ నివారణకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) TB డిటెక్షన్ కోసం కొత్త హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే పరికరాన్ని అభివృద్ధి చేసింది.

TB Disease: TB రోగులకు శుభవార్త.. కొత్త ఎక్స్‌రే పరికరం సృష్టి.. ఇంటి దగ్గరే పరీక్షించుకునే అవకాశం
Tb Disease Detection
Follow us
Surya Kala

|

Updated on: Oct 17, 2024 | 5:10 PM

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) TB వ్యాధిని గుర్తించడానికి కొత్త హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరం సహాయంతో తక్కువ సమయంలో సులభంగా TB వ్యాధిని పరీక్షించవచ్చు. ఈ ఎక్స్-రే యంత్రం ప్రయోజనం ఏమిటంటే.. ఇక నుంచి ఎవరైనా సరే TB ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి ఎక్కడో ఉన్న ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదు. కొత్త పరికరం సహాయంతో ఇంటి దగ్గర కూడా వ్యాధిని సులభంగా పరీక్షించవచ్చు. టీబీని గుర్తించేందుకు కొత్త హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే పరికరాన్ని అభివృద్ధి చేశామని.. ఇది వ్యాధిని ముందుగానే గుర్తిస్తుందని 19వ అంతర్జాతీయ ఔషధ నియంత్రణ అధికారుల (ICDRA) ఇండియా-2024లో ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు.

వాస్తవానికి ఈ హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే యంత్రాలు చాలా ఎక్కువ ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉండేవి. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని ఐఐటీ కాన్పూర్ ఐసిఎంఆర్ భాగస్వామ్యంతో ఎక్స్-రేను అభివృద్ధి చేసిందని డాక్టర్ రాజీవ్ బహ్ల్ చెప్పారు. దేశీయంగా తయారు చేయబడిన ఈ హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే, హ్యాండ్‌హెల్డ్ ధరలో సగం కంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. భారతదేశం కూడా MPOX కోసం మూడు టెస్టింగ్ కిట్‌లను అభివృద్ధి చేసిందని డాక్టర్ బహ్ల్ చెప్పారు. MPOX కోసం మూడు టెస్టింగ్ కిట్‌లను అభివృద్ధి చేశామని, మూడు కంపెనీలు అలాంటి కిట్‌లను తయారు చేస్తున్నాయని చెప్పారు.

TB వ్యాధి ఎందుకు వస్తుందంటే

మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ వల్ల TB వస్తుంది. దీనిని 1882లో జర్మన్ శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ కనుగొన్నారు. TB చికిత్స భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ వ్యాధి కేసులు ఇప్పటికీ నమోదు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ప్రమాదక స్థితికి ప్రజలు చేరుకుంటూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం చాలా మందికి టీబీ లక్షణాల గురించి తక్కువ అవగాహన ఉండటమే. ఈ వ్యాధి శరీరంలో తీవ్రరూపం దాల్చిన తర్వాత మాత్రమే ప్రజలు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో ఇప్పటికీ TB ఒక పెద్ద సమస్య

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్త టీబీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 2025 నాటికి దేశం టీబీ రహిత దేశంగా మారే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యకలాపాలను చేపట్టింది. అనేక TB నిర్మూలన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమంలో TB సంక్రమణ నివారణ, నియంత్రణ (IPC) చర్యలు ఉన్నాయి. ఇవి TB వ్యాప్తిని ఆపడానికి అవసరమైనవి. అయినప్పటికీ టీబీ కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. చాలా మంది టీబీ చికిత్సను మధ్యలోనే వదిలేయడమే దీనికి పెద్ద కారణం. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి మళ్లీ పెరగుతోంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం