AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓట్స్ vs మ్యూస్లీ: బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు? రెండింటి మధ్య అసలు తేడా ఏంటంటే..

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించాలనుకునే వారు ముందుగా మార్చుకునేది తమ అల్పాహారాన్నే. ఈ క్రమంలో ఓట్స్, మ్యూస్లీ అనేవి అందరికీ గుర్తొచ్చే మొదటి పేర్లు. అయితే, ఈ రెండింటిలో ఏది మీ శరీరానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఉదయం అల్పాహారంలో ఓట్స్, మ్యూస్లీ రెండూ ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. కానీ, వీటి తయారీ, పోషకాలలో స్వల్ప తేడాలు ఉన్నాయి. అయితే, బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓట్స్ (Oats), మ్యూస్లీ (Muesli) మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 20, 2026 | 10:49 AM

Share
ఓట్స్ అనేవి నేరుగా ధాన్యం నుండి సేకరించినవి. వీటిని రోల్డ్ ఓట్స్, స్టీల్-కట్ ఓట్స్ లేదా ఇన్‌స్టంట్ ఓట్స్ అని పిలుస్తారు. వీటిలో గ్లూటెన్ ఉండదు. పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొవ్వును (LDL) తగ్గిస్తాయి. షుగర్ ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. వీటిని పాలు లేదా నీటిలో ఉడికించి, పండ్లు లేదా కూరగాయలు కలిపి ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు.

1 / 5
ఓట్స్‌(Oats): ఓట్స్ అనేవి ప్రాసెస్ చేయబడిన తృణధాన్యాలు, వీటిని సాధారణంగా పాలు లేదా నీటితో ఉడికించి తింటారు. ఇవి ఫైబర్ (ముఖ్యంగా బీటా-గ్లూకాన్) కు మంచి వనరు. మరోవైపు, మ్యూస్లీ అనేది ఓట్స్, ఇతర ధాన్యాలు, ఎండిన పండ్లు (Dry fruits), విత్తనాలు, గింజల మిశ్రమం. దీనిని ఉడికించాల్సిన అవసరం లేదు, నేరుగా పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

2 / 5
మ్యూస్లీ (Muesli): మ్యూస్లీ అనేది సిద్ధంగా ఉన్న అల్పాహారం (Ready-to-eat). ఇందులో ఓట్స్‌తో పాటు మొక్కజొన్న రేకులు (Corn flakes), బాదం, కిస్మిస్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి కలిసి ఉంటాయి.
ఇందులో రకరకాల గింజలు ఉండటం వల్ల మినరల్స్, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. దీనిని ఉడికించాల్సిన పనిలేదు కాబట్టి సమయం ఆదా అవుతుంది. మార్కెట్లో లభించే ఫ్లేవర్డ్ మ్యూస్లీలో చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. కొనే ముందు ప్యాకెట్ వెనుక ఉన్న వివరాలను గమనించాలి.

మ్యూస్లీ (Muesli): మ్యూస్లీ అనేది సిద్ధంగా ఉన్న అల్పాహారం (Ready-to-eat). ఇందులో ఓట్స్‌తో పాటు మొక్కజొన్న రేకులు (Corn flakes), బాదం, కిస్మిస్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి కలిసి ఉంటాయి. ఇందులో రకరకాల గింజలు ఉండటం వల్ల మినరల్స్, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. దీనిని ఉడికించాల్సిన పనిలేదు కాబట్టి సమయం ఆదా అవుతుంది. మార్కెట్లో లభించే ఫ్లేవర్డ్ మ్యూస్లీలో చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. కొనే ముందు ప్యాకెట్ వెనుక ఉన్న వివరాలను గమనించాలి.

3 / 5
ఏది బెస్ట్?: మీరు బరువు తగ్గాలని చూస్తుంటే, అదనపు చక్కెర లేని ప్లెయిన్ ఓట్స్ ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఒకవేళ మీరు వ్యాయామం చేసేవారైతే, తక్షణ శక్తి (Instant Energy) కావాలనుకుంటే, పోషకాలు నిండిన మ్యూస్లీని ఎంచుకోవచ్చు.

4 / 5
 ఓట్స్, మ్యూస్లీ రెండూ ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలే. ఏది ఎంచుకున్నా అందులో పంచదారకు బదులుగా తేనె లేదా ఖర్జూరాలు వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. కానీ, వాటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే, ఓట్స్‌నే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మ్యూస్లీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మ్యూస్లీతో పోలిస్తే ఓట్స్‌లో చక్కెర లేకపోవడం వల్ల కూడా కేలరీల సంఖ్య అదుపులో ఉంటుంది. బరువు తగ్గించుకోవడానికి ఎంచుకుంటే, ఓట్స్ ఒక మంచి ఎంపిక అవుతుంది.

5 / 5
Follow Us