AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharathi : వర్కవుట్స్ అస్సలు చేయను.. అందానికి సీక్రెట్ రివీల్ చేసిన దివ్య భారతి..

హీరోయిన్ దివ్య భారతి తన కెరీర్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తన పట్ల చూపిన ప్రేమ, ఆదరణ అద్భుతమని ఆమె పేర్కొన్నారు. బ్యాచిలర్ సినిమాతో నటిగా తమిళంలో తెరంగేట్రం చేసింది ఈ అమ్మడు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మతిలంలో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది.

Rajitha Chanti
|

Updated on: Mar 20, 2026 | 8:54 AM

Share
 ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ దివ్య భారతి. బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా  పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. "అడియే" వంటి పాటలు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇది ఊహించని విజయమని దివ్య భారతి తెలిపారు.

1 / 5
ఫిట్‌నెస్‌కు సంబంధించి, తాను ఫిట్‌నెస్‌ ఫ్రీక్ కాదని, తన శారీరక సౌష్టవం జన్యుపరమైనదని దివ్య భారతి వివరించారు. తాను అంతగా వర్కవుట్‌లు చేయనని, సహజంగానే సన్నగా ఉంటానని చెప్పారు. అయితే, ఒక మంచి కథ, పాత్ర డిమాండ్ చేస్తే, బరువు పెరగడం వంటి శారీరక మార్పులకు సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. కానీ, జుట్టు కత్తిరించుకునే పాత్రలను మాత్రం తన తల్లి అంగీకరించరని, పొడవాటి జుట్టు తనకు నచ్చుతుందని ఆమె చెప్పారని దివ్య భారతి పేర్కొన్నారు. ఆహార నియమాల విషయంలో, తాను ఆకలితో ఉండనని, ప్రతిదీ మితంగానే తింటానని స్పష్టం చేశారు.

2 / 5
సహనటుడు సుధీర్‌తో కలిసి "గోట్" సినిమాలో నటించిన అనుభవం చాలా సరదాగా ఉందని దివ్య భారతి పంచుకున్నారు. సినిమా మొత్తం కామెడీగా ఉండటంతో, సెట్స్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేదని ఆమె తెలిపారు. ప్రారంభంలో భాష తెలియకపోయినా, యూనిట్ సభ్యులు తనకు ఎప్పుడూ కొత్త పరిశ్రమలో ఉన్న భావన కలిగించలేదని ఆమె ప్రశంసించారు. షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు ఒక గ్రామంలో జరిగిందని, అక్కడి కారం ఎక్కువగా ఉన్న ఆహారం, విభిన్న సంస్కృతులు తనకు కొత్త అనుభూతిని కలిగించాయని చెప్పారు.

3 / 5
సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంపై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమకు తామే రక్షణగా నిలబడాలని దివ్య భారతి సూచించారు. పరిశ్రమకు సంబంధించి సమస్యలు ఎదురైతే, అసోసియేషన్‌ల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనీస మర్యాద, సాధారణ జ్ఞానం కలిగి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. రూల్స్‌తో కాకుండా, అంతర్గతంగా మార్పు రావాలని దివ్య భారతి అన్నారు.

4 / 5
భవిష్యత్తులో యాక్షన్, ఎమోషనల్ పాత్రలు చేయాలని ఉందని, యాక్షన్ పాత్రలు తనకు ఎంతవరకు సరిపోతాయో ప్రయోగించి చూడాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు.  తన తల్లి వెటరన్ నటి దివ్య భారతి పేరు మీద తనకు పేరు పెట్టారని, ఆమె అందం, కీర్తిని తాను ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. సినీ పరిశ్రమ పురుషాధిక్యతతో ఉందని, చాలా తక్కువ మంది మహిళా నిర్మాతలు ఉన్నారని, ఇది ప్రస్తుత ప్రపంచ, పరిశ్రమ వాస్తవమని ఆమె అన్నారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర