AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. ఎనిమిదేళ్లుగా అక్కడే ఉన్నా తెలియలేదు! డాక్టర్లే అవాక్కయ్యారు..

వైద్య శాస్త్రంలో అప్పుడప్పుడు కొన్ని కేసులు డాక్టర్లనే ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. తాజాగా చైనాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన గొంతులో 12 సెంటీమీటర్ల పొడవైన మెటల్ చాప్‌స్టిక్‌తో ఏకంగా ఎనిమిదేళ్ల పాటు జీవించాడు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంత పెద్ద వస్తువు గొంతులో ఉన్నప్పటికీ, అతను గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి తీవ్రమైన అసౌకర్యం లేకుండా తన సాధారణ జీవితాన్ని గడిపాడు. వైద్యులు వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. ఎనిమిదేళ్లుగా అక్కడే ఉన్నా తెలియలేదు! డాక్టర్లే అవాక్కయ్యారు..
Chopstick Stuck In Throat
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2026 | 12:44 PM

Share

చైనాకు చెందిన ఒక వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం ప్రమాదవశాత్తు 12 సెంటీమీటర్ల పొడవున్న లోహపు చాప్‌స్టిక్‌ను మింగేశాడు. బాధితుడు ఎనిమిదేళ్ల క్రితం ఆహారం తింటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక లోహపు చాప్‌స్టిక్‌ను మింగేశాడు. ఆ సమయంలో కొంత ఇబ్బంది అనిపించినా, తర్వాత అది లోపలికి వెళ్లిపోయిందని అతను భావించాడు. చిత్రం ఏంటంటే, ఆ ఎనిమిదేళ్ల కాలంలో అతనికి ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. అతను రోజూలాగే ఆహారం తీసుకోవడం, పనులు చేసుకోవడం చేస్తూనే ఉన్నాడు. కానీ, ఇటీవల కాలంలో అతనికి గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు, తరచుగా నొప్పి వస్తున్నట్లు అనిపించింది. దీంతో అతను స్థానిక ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. వైద్యులు ఎక్స్-రే, సిటీ స్కాన్ తీయగా, అతని గొంతులో అన్నవాహిక (Esophagus) పక్కన ఒక పొడవైన లోహపు వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అది 12 సెంటీమీటర్ల పొడవు ఉందని తెలిసి వైద్యులు ఒక్కసారిగా భీతిల్లారు.

వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంత పెద్ద లోహపు వస్తువు అన్నవాహికను చీల్చుకుని గుండెకు లేదా ఊపిరితిత్తులకు వెళ్లే ప్రధాన రక్తనాళాలను తాకకపోవడం ఒక అద్భుతమని శస్త్రచికిత్స చేసిన వైద్యులు తెలిపారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. కానీ, ఈ కేసులో ఆ చాప్‌స్టిక్ ఒక సురక్షితమైన ప్రదేశంలో స్థిరంగా ఉండిపోయింది. దాదాపు గంటన్నర పాటు శ్రమించి వైద్యులు ఆ వస్తువును బయటకు తీశారు.

ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు. ఆహారం తీసుకునేటప్పుడు లేదా చిన్న పిల్లలు వస్తువులతో ఆడుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఏదైనా వస్తువును పొరపాటున మింగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..