AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో ఎప్పుడూ రద్దీ! ఫిదా అవుతున్న పర్యాటకులు

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అది ఏ విదేశీ ప్రదేశమో తెలియక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాంతం తెల్లటి మంచుతో కప్పబడిన స్విట్జర్లాండ్ లాగా లేదా మాల్దీవుల బీచ్ తీరం లాగా కనిపిస్తుంది. పాలలాంటి ప్రదేశంలో నీలి నీరు, దాని ఒడ్డున విస్తరించి ఉన్న తెల్లని భూభాగం, చుట్టూ ప్రశాంతమైన దృశ్యం కనిపిస్తుంది.. ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉందంటే, అదొక విలాసవంతమైన పర్యాటక ప్రదేశంలా అనిపిస్తుంది. ఆ దృశ్యం మొత్తం ఒక పోస్ట్‌కార్డ్‌లా ఉంది. ఆ వీడియోలో, కొంతమంది అటూ ఇటూ తిరుగుతూ ఫోటోషూట్‌లు చేస్తూ కనిపిస్తారు. ఇది ఆ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. కొంతమంది యూజర్లు దీనిని భారతదేశపు మాల్దీవులు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. కానీ, కథలో అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.

మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో ఎప్పుడూ రద్దీ! ఫిదా అవుతున్న పర్యాటకులు
Kishangarh Marble Slurry
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2026 | 12:13 PM

Share

పర్యాటక ప్రియులు మాల్దీవులకో లేదా స్విట్జర్లాండ్ కో వెళ్లాలని కలలు కంటుంటారు. కానీ, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో ఉన్న ఒక ప్రదేశం చూస్తే, మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసి అందరూ అది విదేశీ ప్రదేశం అనుకుంటున్నారు. కానీ, అది అజ్మీర్ లోని మార్బుల్ డంపింగ్ యార్డ్. ఇది ఒక అందమైన వ్యర్థాల కుప్ప. కిషన్‌గఢ్ ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ మార్కెట్. ఇక్కడ వేల సంఖ్యలో మార్బుల్ కటింగ్ యూనిట్లు ఉన్నాయి. రాయిని కోసేటప్పుడు వచ్చే తెల్లటి పొడిని (Slurry) దశాబ్దాలుగా ఒక నిర్దేశిత ప్రాంతంలో పారబోస్తున్నారు. కాలక్రమేణా ఈ వ్యర్థాలు పేరుకుపోయి సుమారు 500-600 ఎకరాల్లో తెల్లటి కొండల్లా విస్తరించాయి. దీనిపై సూర్యరశ్మి పడినప్పుడు అది వెండిలా మెరుస్తూ మంచు కొండలను తలపిస్తుంది.

దశాబ్దాలుగా ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోసిన మార్బుల్ పౌడర్ కాలక్రమేణా గడ్డకట్టి, తెల్లటి కొండల్లా మరియు మైదానాల్లా మారిపోయింది. వర్షపు నీరు ఇక్కడ చేరడంతో అది నీలి రంగులోకి మారి, మాల్దీవుల సముద్ర తీరాన్ని తలపిస్తోంది. ఈ ‘వేస్ట్ యార్డ్’ ఇప్పుడు పర్యాటకులకు, ముఖ్యంగా ప్రీ-వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్ల కోసం అత్యంత ఇష్టమైన ప్రదేశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ఉన్న నీటి గుంటల్లో నీరు నీలి రంగులో కనిపిస్తూ మాల్దీవుల సముద్రపు నీటిని గుర్తు చేస్తుంది. ఈ అద్భుతమైన నేపథ్యం (Background) కారణంగా సినిమా షూటింగులు, మ్యూజిక్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి ఇది స్వర్గధామంగా మారింది. ఎంతో మంది జంటలు తమ ప్రీ-వెడ్డింగ్ షూట్స్ కోసం ఇక్కడికి తరలివస్తున్నారు. ఒక వ్యర్థాల కుప్ప ఇంత అందంగా మారుతుందని ఎవరూ ఊహించలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇది చూడటానికి ఎంత అందంగా ఉన్నా, ఇది రసాయనిక వ్యర్థాల కుప్ప అని మర్చిపోకూడదు. ఇక్కడి ధూళి వల్ల శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. ఒకప్పుడు పారిశ్రామిక వ్యర్థంగా భావించిన ఈ ప్రాంతం, ఇప్పుడు రాజస్థాన్ పర్యాటకానికి ఒక కొత్త ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..