AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాట్లాడితే కోట్ల వర్షం కురవాల్సిందే..! ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?

IPL commentators salary: ఐపీఎల్ అంటే కేవలం ఆటగాళ్లకే కాదు, మైక్ పట్టే కామెంటేటర్లకూ భారీ సంపాదనే. మైదానంలో బౌండరీలు, సిక్సర్లు ఎంత సంచలనం సృష్టిస్తాయో, కామెంటరీ బాక్స్‌లో మాటల మాంత్రాలు కూడా అంతే కీలకం. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో కామెంటేటర్లు ఎంత పారితోషికం పొందుతారన్న విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

మాట్లాడితే కోట్ల వర్షం కురవాల్సిందే..! ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
Ipl Commentators Salary
Venkata Chari
|

Updated on: Mar 20, 2026 | 12:44 PM

Share

ప్రపంచంలో అత్యంత ధనిక టీ20 లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది కోట్ల రూపాయల లావాదేవీలకు కేంద్రబిందువవుతోంది. జట్టు యజమానులు, స్టార్ క్రికెటర్లు, బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వాములు భారీ స్థాయిలో ఆదాయం పొందుతారు. అయితే ఎక్కువ మంది దృష్టి ఆటగాళ్లపైనే ఉంటే, ప్రసారాలకు ప్రాణం పోసే కామెంటేటర్ల సంపాదన కూడా తక్కువేమీ కాదని మీకు తెలుసా? వాళ్లు జీతాలు ఎంతుటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కామెంటరీ బాక్స్‌లోనూ కోట్ల ఆటే..

ఒక మ్యాచ్‌ను ప్రేక్షకులకు మరింత రసవత్తరంగా మార్చేది కామెంటరీ. మ్యాచ్‌లోని ఒత్తిడి, ఉత్కంఠ, వ్యూహం, ఆటగాళ్ల మూడ్ ఇలా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత కామెంటేటర్లది. అందుకే వారి అనుభవం, భాషపై పట్టు, ఆటపై అవగాహన ఆధారంగా వారికి భారీ పారితోషికాలు చెల్లిస్తారు.

హిందీ, ప్రాంతీయ కామెంటేటర్ల జీతాలు ఎంత..?

రిపోర్టుల ప్రకారం, హిందీ కామెంటేటర్లు ఒక ఐపీఎల్ సీజన్‌కు సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు పారితోషికం పొందుతున్నట్లు సమాచారం. ఇక జూనియర్ కామెంటేటర్లకు ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ. 35,000 వరకు చెల్లిస్తారని తెలుస్తోంది. తమిళం వంటి ప్రాంతీయ భాషల కామెంటేటర్లకు కూడా దాదాపు ఇదే రేంజ్‌లో చెల్లింపులు ఉంటాయని చెబుతున్నారు.

ఇంగ్లిష్ కామెంటేటర్లకే అత్యధిక పారితోషికం..

ఐపీఎల్ ప్రసారంలో ఇంగ్లిష్ కామెంటేటర్లకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ గుర్తింపు, విశ్లేషణా నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాదరణ కారణంగా వీరు ఎక్కువ పారితోషికం అందుకుంటారు. మాజీ భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒక సీజన్‌కు సుమారు రూ. 4.17 కోట్లు వసూలు చేస్తారని రిపోర్టులు చెబుతున్నాయి.

గవాస్కర్ తర్వాత ఎవరు..?

గవాస్కర్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడన్, వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ వంటి ప్రముఖులు కూడా ఒక్కో ఐపీఎల్ సీజన్‌కు రూ. 4.17 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. వీరి కామెంటరీ శైలి, అంతర్జాతీయ అనుభవం, ప్రేక్షకులను ఆకట్టుకునే తీరు వారికి ఈ స్థాయి ఆదాయం తెస్తున్నాయి.

కామెంటేటర్ల పాత్ర ఎందుకు అంత ముఖ్యమంటే?

కామెంటరీ కేవలం మ్యాచ్ వివరణ కాదు. అది ప్రేక్షకుడి భావోద్వేగానికి కనెక్ట్ అయ్యే స్వరం. మంచి కామెంటేటర్ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చగలడు. అందుకే ఐపీఎల్ వంటి లీగ్‌లో కామెంటేటర్ల ఎంపిక కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఐపీఎల్‌లో మైదానంలో పరుగుల వర్షం కురిస్తే, కామెంటరీ బాక్స్‌లో మాటల విలువ కోట్లలో కొలవబడుతోంది. స్టార్ ఆటగాళ్లలా స్టార్ కామెంటేటర్లూ ఈ లీగ్‌లో కీలక భాగస్వాములే అన్న విషయం మరోసారి స్పష్టమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us