AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్.. రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Rohit Sharma : భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డేలో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేస్తే ఓపెనర్‌గా 16,000 అంతర్జాతీయ పరుగుల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలవడంతో పాటు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా అధిగమించే అవకాశముంది.

Rohit Sharma : చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్.. రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు
Rohit Sharma
Rakesh
|

Updated on: Jun 12, 2026 | 8:33 AM

Share

Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త క్రికెట్ మజా అందించేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 13 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు ధర్మశాలలోని అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ తొలి ముఖాముఖి మ్యాచ్ భారత స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత ప్రత్యేకంగా నిలవబోతోంది. ఈ మ్యాచ్‌లో హిట్ మాన్ ఒక అరుదైన చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధమయ్యాడు.

6 పరుగుల దూరంలో చారిత్రాత్మక మైలురాయి

క్రికెట్ ప్రపంచంలో హిట్ మాన్‎గా పేరుగాంచిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 6 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. జూన్ 13న ధర్మశాల మైదానంలో రోహిత్ తన వ్యక్తిగత స్కోరు 6 పరుగులు పూర్తి చేయగానే.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఎలైట్ క్లబ్‌లో భాగస్వామి అవుతాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అన్ని ఫార్మాట్లలో కలిపి 16 వేల పరుగులు సాధించడం అనేది ఏ బ్యాటర్‌కైనా ఒక కల లాంటిది. ఇప్పుడు ఆ కలను రోహిత్ నిజం చేసుకోబోతున్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్ సరసన రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ క్లాస్ బ్యాటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఇంతకుముందు ఈ అద్భుతమైన రికార్డు కేవలం ముల్తాన్ సుల్తాన్‎గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ పేరిట మాత్రమే నమోదై ఉంది. సెహ్వాగ్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో ఓపెనర్‌గా ఆడి మొత్తం 16,119 పరుగులు సాధించాడు. ఇప్పుడు రోహిత్ ఆ మార్కును అందుకోవడమే కాకుండా.. ఈ సిరీస్ లోనే సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డును అధిగమించి భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ ఓపెనర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది.

రోహిత్ శర్మ కెరీర్‌ను మార్చేసిన 2013 ఏడాది

రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో ఆయన మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చాడు. ఆ సమయంలో రోహిత్ ప్రదర్శన తీవ్రమైన ఒడిదుడుకులతో సాగింది. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే, మరో మూడు మ్యాచ్ లలో విఫలమయ్యేవాడు. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. ఆ ఒక్క నిర్ణయం రోహిత్ శర్మ తలరాతను, భారత క్రికెట్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఓపెనర్‌గా మారిన తర్వాతే రోహిత్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాది హిట్ మాన్‎గా అవతరించాడు. ఇప్పుడు అదే ఓపెనింగ్ స్థానంలో 16 వేల పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించేందుకు ముంగిట నిలిచాడు.

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిన్నప్పుడు గొర్రెలు కాశాడు.. ఇప్పుడు IPS అధికారి అయ్యాడు!
చిన్నప్పుడు గొర్రెలు కాశాడు.. ఇప్పుడు IPS అధికారి అయ్యాడు!
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం