AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా తర్వాత 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది.. రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్

దసరా నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడు దీపావళి పండగ సందడి మొదలైంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే దీపావళి పండగ గురించి అనేక పురాణకథలు ఉన్నాయి. శ్రీ రాముడు, రామాయణం గురించి అందరికీ తెలుసు. చిన్నతనం నుంచి శ్రీ రాముడు, రామాయణ కథలు వింటూ పెరిగిన వారు.. అయితే ఇప్పుడు శ్రీరాముడికి సంబంధించిన ఓ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలంక నుంచి అయోధ్యకు శ్రీరాముడు 21 రోజుల పాటు ప్రయాణించాడని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో.. ఇది నిజమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

దసరా తర్వాత 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది.. రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్..  ట్వీట్ వైరల్
Lord Rams 21 Day Journey
Surya Kala
|

Updated on: Oct 17, 2024 | 3:24 PM

Share

రామాయణం అత్యంత ముఖ్యమైన హిందూ గ్రంథం. చాలా మందికి రామాయణ కథలతో సుపరిచితం. శ్రీరాముడు, రామాయణానికి భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు నడక, నడతతో దైవంగా పూజించిపబడుతున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే దసరా ముగిసి దీపావళి రానున్న నేపధ్యంలో ప్రస్తుతం శ్రీరాముడు శ్రీలంక నుంచి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజుల పాటు ప్రయాణించాడంటూ ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్లేందుకు 21 రోజుల 10 గంటల సమయం పడుతుందని గూగుల్ మ్యాప్ చెబుతోంది. ముకుల్ దేఖానే తన ఖాతాలో చిన్న Google మ్యాప్ స్క్రీన్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోతో ‘దసరా తర్వాత 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటారు? శ్రీరామ చంద్రుడు శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్ళడానికి నడవడానికి 21 రోజులు పట్టింది.. ఇది నిజమేనా? ఇది Google Mapsలో సెర్చ్ చేయగా రిజల్ట్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. లంక నుండి అయోధ్యకు తిరిగి రావడానికి 21 రోజులు పట్టిందని తెలిసి తాను షాక్ తిన్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ ఎక్స్ పోస్ట్; దసరా తర్వాత 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటారు.

శ్రీరాముడు సీతా సమేతంగా తన పరివారాన్ని తీసుకుని శ్రీలంక నుండి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు. ఈ విషయం గురించి Google మ్యాప్స్‌లో తనిఖీ చేయగా.. 504 గంటలను 24 గంటలు గా డివైడ్ చేస్తే సమాధానం 21.00 21 రోజులని అన్సర్ రావడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు.. ఈ విషయాన్నీ ధృవీకరించుకోవడానికి తాను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌ని సెర్చ్ చేసినట్లు తెలిపారు. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ .. నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని తెలిసింది.. అంటే 21 రోజులు పడుతుందని చూసి నేను ఆశ్చర్యపోయానని తెలిపాడు.

ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘దసరా నుంచి దీపావళి మధ్య 21 రోజుల గ్యాప్‌తో సమానంగా ఉంటుంది’ అని ఒక నెటిజన్ అన్నారు. ఇది దీపావళి, దసరా ప్రాముఖ్యతను హైలైట్ చేసింది’ అని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ ‘శ్రీరాముని ఇతిహాస యాత్రను.. చూపిస్తూనే హిందూ సంప్రదాయం ప్రకారం త్రేతాయుగం నుంచి దసరా, దీపావళిని జరుపున్నట్లు పురాణాలు తెలిపిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..