- Telugu News Spiritual Chanakya Niti in Telugu: Those who follow these traits of rooster they are guaranteed to achieve success in life
Chanakya Niti: ప్రకృతే ఒక పాఠశాల.. కోడి పుంజులోని ఈ లక్షణాలు అనుసరించే వారి లైఫ్‌లో విజయం గ్యారెంటీ అన్న చాణక్య
ప్రకృతి ఒక పాఠశాల.. అందులో ఉన్న జీవుల జీవిత పాఠాలను నేర్పించే పుస్తకాలూ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఆచార్య చాణుక్యుడు మనవ జీవితం గురించి చెప్పిన విషయాలు నేటి తరానికి కూడా ఆచరణీయం. చాణక్యక్యుడు లేదా కౌటిల్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలో విజయం సాధించడానికి ప్రకృతి ఒక ముఖ్యమైన పుస్తకం అని .. అందులోని జీవులు ఒక పుటలని పేర్కొన్నాడు. అలాంటి జీవుల్లో ఒకటి కోడి పుంజు. దీనికి సంబంధించిన నాలుగు ముఖ్యమైన లక్షణాలను వివరించాడు. కోడి పుంజులోని ఈ నాలుగు లక్షణాలను అనుసరించే వారు విజయవంతమవుతారని వెల్లడించాడు.
Updated on: Oct 10, 2024 | 11:03 AM

ఆచార్య చాణక్య ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరు. నేటికీ చాణక్యుడి తత్వం పిల్లలు, వృద్ధులు, యువకులు, మహిళలు అనుచరించాల్సిన విధానం గురించి చెబుతూనే ఉంటుంది. జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మానసిక దృఢత్వంతోనే సమస్యలను పరిష్కరించుకోగలమని చాణక్యుడు చెప్పాడు. కనుక ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి.

సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు కష్టమైన పనిలో కూడా విజయం సాధిస్తారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కోడి పుంజు కి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను పేర్కొన్నాడు. కోడిపుంజులోని ఈ గుణాలను మనిషి జీవితంలో అలవర్చుకుంటే విజయం ఖాయమని స్పష్టం చేశారు.

సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి తొలి అడుగు కూడా. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు కోడి కూస్తుంది. మనుషులు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచినట్లయితే పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. చాణక్యుడు ప్రకారం త్వరగా మేల్కొవడం అనేది వ్యక్తికి సానుకూల శక్తిని కలిగిస్తుంది. తద్వారా అతను రోజంతా తన పనిని తను సమర్థవంతంగా, శక్తివంతంగా పూర్తి చేస్తారు.

ధైర్యంగా పోరాడు అంటాడు చాణక్యుడు. జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటిని అధిగమించడానికి మార్గంలో వచ్చిన అన్ని అడ్డంకులను తట్టుకోవాలి. కోడి పుంజు ఎల్లప్పుడూ మేల్కొని ఉంటుంది. తన శత్రువును గ్రహించిన క్షణంలో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడూ తాను చేస్తున్న పోరాటాన్ని ఆపదు. సమస్యలకు భయపడదు. సంక్షోభం వచ్చినప్పుడు దృఢ సంకల్పంతో ఎదుర్కొనే వారు విజయం సాధిస్తారు.

నిజాయితీగా, కష్టపడి సంపాదించిన డబ్బుతో సంతృప్తి చెందండి. ఇది జీవితంలో ఆనందం, శాంతిని ఇస్తుంది. కష్టపడి వచ్చే ఆదాయం తక్కువే అయినా సంతోషాన్ని, గౌరవాన్ని కలిగిస్తుంది.

ఇతరులపై ఆధారపడవద్దు. కోడి పుంజు తమ కడుపుని తాము నింపుకుంటాయి. ఇలా చేయడం .. పొట్టని నింపుకోవడం ఎప్పుడూ కష్టమే. జీవితంలో కష్టపడి సాధించిన విజయాల రుచి మధురంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.





























