Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయంలో రక్త పాతం జరగదు.. బలి ఇచ్చిన మేకకు మళ్ళీ ప్రాణం.. ఈ బలికార్యక్రమాన్ని చూసేందుకు పోటెత్తే భక్తులు

అమ్మవారి ఆలయంలో మేకలు, లేదా కోళ్లను బలి ఇస్తే అవి కళ్ల ముందే చనిపోతాయి. అయితే ఒక ఆలయంలో బలి ఇచ్చిన మేక కొద్దిసేపటికే లేచి నడవడం ప్రారంభించింది. ఇది విని సినిమా స్టోరీ అని కోవడం లేదా పిట్ట కథలు అని అంటున్నారా.. కానే ఇది నిజంగా జరిగిన ఓ అమ్మవారి ఆలయంలో జరిగింది. ఆ మహా మహిమానిత్వ ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఆలయంలో రక్త పాతం జరగదు.. బలి ఇచ్చిన మేకకు మళ్ళీ ప్రాణం.. ఈ బలికార్యక్రమాన్ని చూసేందుకు పోటెత్తే భక్తులు
Mundeshwari Mata Temple
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2024 | 10:36 AM

ఒకానొక సమయంలో దేవుళ్ళకు బలి ఇవ్వడం ఆచారంగా ఉండేది. అయితే ఇప్పటీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మేకలు, కోళ్ళు వంటి వాటిని బలిని ఇవ్వడం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామ దేవతలకు జాతర సమయంలో బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇలా అమ్మవారి ఆలయంలో మేకలు, లేదా కోళ్లను బలి ఇస్తే అవి కళ్ల ముందే చనిపోతాయి. అయితే ఒక ఆలయంలో బలి ఇచ్చిన మేక కొద్దిసేపటికే లేచి నడవడం ప్రారంభించింది. ఇది విని సినిమా స్టోరీ అని కోవడం లేదా పిట్ట కథలు అని అంటున్నారా.. కానే ఇది నిజంగా జరిగిన ఓ అమ్మవారి ఆలయంలో జరిగింది. ఆ మహా మహిమానిత్వ ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పన్వర కొండపై ఉన్న ముండేశ్వరి భవాని ఆలయంలో ఇదే జరుగుతుంది. ఇక్కడ భవాని దేవి ఎప్పుడూ రక్తాన్ని ఆశించదు. ఎవరి ప్రాణం ఇవ్వమని కోరదు. నిజానికి అమ్మవారిని బలి ఇచ్చే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మేకను బలి ఇవ్వడానికి కత్తి లేదా మరే ప్రాణాలు తీసే ఆయుధం ఉపయోగించరు. ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న అక్షతలను వేసిన వెంటనే మేక చనిపోతుంది. తర్వాత ఆ అక్షతలను విసిరితే మేక సజీవంగా లేచి తిరుగుతుంది.

ఈ ఆలయం, ఈ స్థలం వివరాలు దుర్గా మార్కండేయ పురాణంలోని సప్తశతి విభాగంలో కనిపిస్తాయి. ఈ మార్కండేయ పురాణం ప్రకారం ఒకప్పుడు చందా, ముండా అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఈ రాక్షస రాజులు శుంభ, నిశుంభలకు సేవ చేసిన ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు. ఈ రాక్షసుల దౌర్జన్యాలు విజృంభించడంతో దుర్గాదేవి అవతరించాల్సి వచ్చింది. భవాని దేవి మహిషునిపై స్వారీ చేసి చందాని సంహరించిన అనంతరం ముండా పన్వర కొండపై దాక్కున్నాడు. అయితే భవాని .. ముండాని ఆ కొండపై సంహరించింది. ఆ తర్వాత అమ్మవారు అదే రూపంలో ఇక్కడ కొలువై  ముండేశ్వరి మాతగా పూజలను అందుకుంటుంది. ఇక్కడ ఉన్న ముండేశ్వరి విగ్రహం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ విగ్రహంపై ఎక్కువసేపు దృష్టి నిలపరేరని చెబుతారు.

ఇవి కూడా చదవండి

త్యాగం ఎలా చేస్తారంటే

ఆలయ పూజారి ప్రకారం ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడాది పొడవునా భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారు. ప్రజల కోరికలు నెరవేరినప్పుడు.. భవానీ దేవికి తమ కృతజ్ఞతలు తెలియజేయడానికి, అమ్మవారికి బలులు సమర్పించడానికి వస్తారు. పూజారి ప్రకారం ఇక్కడ భవానీ దేవికి మేకను బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడూ రక్తపాతం జరగదు. నిజానికి బలి కోసం మేకను అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువస్తారు. మంత్రం పఠిస్తూ .. పూజారి మేకపై అక్షతలను విసురుతారు.

అక్షతలను విసరనే మళ్ళీ ప్రాణం పోసుకునే మేక

ఈ అక్షతల ప్రభావం వల్ల మేక వెంటనే స్పృహ కోల్పోతుంది. నేలపై పడి శ్వాస ఆగిపోతుంది. దీని తరువాత మిగిలిన పూజ ప్రక్రియ పూర్తి చేస్తారు. పూజలో చివరి కార్యక్రమంలో అక్షతలను మళ్లీ మేకపై పోస్తారు. ఈసారి అక్షతల ప్రభావంతో మేక మళ్ళీ జీవం పోసుకుని ఆలయం బయట పడిగాపులు కాస్తుంది. ఈ బలి సంప్రదాయాన్ని చూసేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు వస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి