AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రతన్ టాటా పట్టిందల్లా బంగారమే.. ఉప్పు, కార్ల తయరీ నుంచి సాఫ్ట్‌వేర్.. దిగ్గజ వ్యాపారవేత్త అసామాన్య జర్నీ..

వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. వ్యాపార రంగంలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ద్వారా టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళారు. దేశంలో టాటా కంపెనీ తొలిసారిగా చేపట్టిన ఉత్పత్తులను గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి. ఉక్కు కర్మాగారం, విమానయాన సంస్థ ప్రారంభం అయినా సరే తాను అడుగు పెట్టిన వ్యాపార రంగంలో కొత్త రికార్డులు నెలకొల్పారు. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు

రతన్ టాటా పట్టిందల్లా బంగారమే.. ఉప్పు, కార్ల తయరీ నుంచి సాఫ్ట్‌వేర్.. దిగ్గజ వ్యాపారవేత్త అసామాన్య జర్నీ..
Tata Group
Surya Kala
|

Updated on: Oct 10, 2024 | 9:31 AM

Share

రతన్ టాటా…పేరు చెబితే చాలు. మాటల్లో చెప్పలేని వ్యక్తిత్వం ఆయనది. ఇండస్ట్రీకి చెందిన ఈ స్టార్ ఇప్పుడు మన మధ్య లేరు. 86 సంవత్సరాల వయస్సులో దివికేగారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టాటా గ్రూపును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన రతన్ టాటా మార్చి 1991 నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా టాటా గ్రూప్‌ను నడిపించారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న రతన్ టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్ లో అసిస్టెంట్ గా చేరారు.ఆ తర్వాత జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన తన బాధ్యతలను నిర్వహించడం మొదలు పెట్టారు. రతన్‌టాటా. వ్యాపార రంగంలో సాహాసాలకు ఆయన మారుపేరుగా మారారు. రతన్ టాటా గురించి చెప్పడానికి ఎంతో ఉంది.

ఉప్పు నుంచి విమానం వరకు ప్రయాణం

వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. వ్యాపార రంగంలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ద్వారా టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళారు. దేశంలో టాటా కంపెనీ తొలిసారిగా చేపట్టిన ఉత్పత్తులను గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి. ఉక్కు కర్మాగారం, విమానయాన సంస్థ ప్రారంభం అయినా సరే తాను అడుగు పెట్టిన వ్యాపార రంగంలో కొత్త రికార్డులు నెలకొల్పారు. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. రతన్ పట్టిందల్లా బంగారమే అనిపించుకున్నారు.

టాటా అయోడిన్ ఉప్పు

టాటా టాటా గ్రూప్ దేశంలోనే తొలిసారిగా అయోడిన్‌తో కూడిన ఉప్పు ప్యాకెట్లను విక్రయించడం ప్రారంభించింది. 1983లో తయారీ మొదలు పెట్టుకున్న ఈ టాటా ఉప్పును నేడు ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు టాటా కంపెనీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ SUV టాటా సఫారిని 1998 సంవత్సరంలో విడుదల చేసింది. 2013 సంవత్సరంలో మొదటి హైడ్రోజన్ బస్సు స్టార్‌బస్ ప్రారంభించారు. అంతేకాదు 2018 లో టాటా నెక్సాన్ 5-స్టార్ రేటింగ్ కారును మార్కెట్లో విడుదల చేసింది. అదే సమయంలో మొదటి స్లిమ్ మెకానికల్ వాచ్ కూడా 2021లో తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

నానో కారు ప్రారంభం

ప్రతి వ్యక్తి తన ఇంట్లో కారు ఉండాలని కలలు కంటాడు. అయితే అధిక బడ్జెట్ కారణంగా కారు సామాన్యులకు అందుబాటులో లేదు. రతన్ టాటా కూడా ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. నానో కారు.. కార్ల ప్రపంచంలో ఓ అద్భుత ఆవిష్కరణ. లక్ష రూపాయలకే ప్రతి ఇంటికి కారు అందిస్తానని హామీ ఇచ్చిన రతన్‌టాటా అలాగే ప్రారంభించారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైక్‌ ధరలకే కారు అందుబాటులో ఉండటం ఎంత సాహసం? అదే టాటా పరిచయం చేసిన ‘టాటా నానో’ కారు.

ప్రతి ఇంటికి కారు అందిస్తానన్న ఈ దిగ్గజ కల నెరవేరడానికి టాటా గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. అయినా ఇచ్చిన హామీ మేరకు నానో కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టారు రతన్‌టాటా. టాటా నానో కార్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో లక్ష రూపాయలకే కారు అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే.. నానో కారును రతన్ టాటా కలల కారుగా చెప్పుకుంటారు.

గ్లోబల్ సంస్థగా మార్చిన రతన్..

1868లో ఒక చిన్న వస్త్ర, వ్యాపార సంస్థగా ప్రారంభమైన టాటా గ్రూప్ నుంచి ఉప్పు, ఉక్కు, కార్ల తయారీ వరకూ వ్యాపార సంస్థల్లో విస్తరించాయి. తర్వాత ప్రపంచ నాయకుడిగా రూపాంతరం చెందింది సాఫ్ట్‌వేర్, పవర్ ప్లాంట్లు , విమానయాన సంస్థలలో అడుగు పెట్టింది టాటా సంస్థ. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో చరిత్రలు సృష్టించిన కాలం ఇది. ఈ టాటా గ్రూప్ కు ఆదాయం, లాభాలు కొత్త శిఖరాలకు చేరుకుంది.

రతన్ టాటా ప్రస్తుతం టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో సర్ రతన్ టాటా ట్రస్ట్ , అలైడ్ ట్రస్ట్ అలాగే సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, అలైడ్ ట్రస్ట్ ఉన్నాయి. రతన్ టాటా భారతీయ వ్యాపార ప్రపంచానికి చాలా ముఖ్యమైన సహకారం అందించారు. భారతదేశపు ‘రతన్’ అని పిలువబడే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, దేశంలోని ప్రతి పౌరుడు హృదయపూర్వకంగా గౌరవించే వ్యక్తులలో ఒకరు. బిలియనీర్లలో చేరినప్పటికీ తన సింప్లిసిటీ కారణంగా ప్రతి ఒక్కరికీ ప్రియమైన వ్యక్తి అయ్యారు.

బిలియనీర్ అయినప్పటికీ రతన్ టాటా తన జీవితమంతా బ్రహ్మచారిగా మిగిలిపోయారు.. తన ప్రేమని వ్యాపారం అభివృద్ధి వైపు దృష్టి మరలించి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అతను ‘ది టాటా గ్రూప్’ని విజయాల శిఖరాలకు తీసుకెళ్లడంలో తన యవ్వనాన్ని గడిపారు. భారతదేశంలోని రెండు అత్యున్నత పౌర పురస్కారాలు, పద్మ విభూషణ్ (2008), పద్మ భూషణ్ (2000) లభించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు