Ratan Tata no more: పార్సీల అంత్యక్రియలు అన్ని మతాల కంటే భిన్నం.. రతన్ టాటా డెడ్ బాడీని రాబందులకి అప్పగిస్తారా?

రతన్ టాటా భౌతికకాయాన్ని కోల్బాలోని ఆయన ఇంటికి తరలించారు. ఆయన భౌతికకాయాన్ని ఈ రోజు (గురువారం) వర్లీ శ్మశానవాటికకు తరలించనున్నారు. అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించనున్నారు. ప్రస్తుతం పార్సీ ఆచారాల ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే పార్సీల అంత్యక్రియల సంప్రదాయం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల అంత్యక్రియల సంప్రదాయానికి భిన్నంగా ఉంటుందని మీకు తెలుసా..!

Ratan Tata no more: పార్సీల అంత్యక్రియలు అన్ని మతాల కంటే భిన్నం.. రతన్ టాటా డెడ్ బాడీని రాబందులకి అప్పగిస్తారా?
Ratan Tata
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2024 | 12:16 PM

భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. రతన్ టాటా వయసు 86 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వరం రోజులుగా ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం రతన్ టాటా భౌతికకాయాన్ని కోల్బాలోని ఆయన ఇంటికి తరలించారు. ఆయన భౌతికకాయాన్ని ఈ రోజు (గురువారం) వర్లీ శ్మశానవాటికకు తరలించనున్నారు. అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించనున్నారు. ప్రస్తుతం పార్సీ ఆచారాల ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే పార్సీల అంత్యక్రియల సంప్రదాయం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల అంత్యక్రియల సంప్రదాయానికి భిన్నంగా ఉంటుందని మీకు తెలుసా..!

పార్సీలు హిందువులలాగా తమ బంధువుల మృతదేహాలను దహనం చేయరు. ముస్లింలు, క్రైస్తవులలాగా శవ పేటికల్లో పెట్టి పాతిపెట్టరు. వీటన్నిటికి భిన్నంగా పార్సీల అంత్యక్రియలు ఉంటాయి. ఈ సంప్రదాయం 3 వేల సంవత్సరాల నాటిది. పార్సీల స్మశానవాటికను దఖ్మా లేదా టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. టవర్ ఆఫ్ సైలెన్స్ వృత్తాకార బోలు భవనం రూపంలో ఉంటుంది.

పార్సీల్లో ఎవరైనా మరణిస్తే.. వారు మరణించిన అనంతరం వారి భౌతిక కాయాన్ని శుద్ధి చేసే ప్రక్రియను నిర్వహిస్తారు. అనంతరం వారి మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు. పార్సీల అంత్యక్రియల ప్రక్రియను దోఖ్మెనాషిని అంటారు. ఇందులో మృత దేహాలను ఆకాశంలో ఖననం చేస్తారు (Sky Burials). అంటే.. మృతదేహాన్ని సూర్యరశ్మికి, మాంసాహార పక్షులకు ఆహారంగా బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు. అంటే మరణించిన తర్వాత కూడా జీవితంలో చివరి దాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించడమే.. ఈ రకమైన అంత్యక్రియలు నిర్వహించడంలో గల ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. అంతేకాదు పార్సీ తరహాలోనే బౌద్ధ మతానికి చెందిన వారు కూడా ఇలాంటి అంత్యక్రియలను నిర్వహిస్తారు. మృత దేహాన్ని కూడా రాబందులకు అప్పగిస్తారు.

ఇవి కూడా చదవండి

JRD టాటా పునాది వేశారు

ముంబైలో పార్సీలకు ప్రత్యామ్నాయ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మొదటి ప్రార్థన మందిరానికి 1980లలో ప్రముఖ పారిశ్రామికవేత్త JRD టాటా (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా) పునాది వేశారు. పార్సీల అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసే ప్రార్థనా మందిరం.

1980వ దశకంలో JRD టాటా సోదరుడు BRD టాటా మరణించిన తర్వాత…JRD టాటా ముంబై మున్సిపల్ కమిషనర్ జంషెడ్ కంగాను సంప్రదించిన ఆయన తన సోదరుడి అంత్యక్రియలకు ముంబైలోని ఏ శ్మశానవాటిక మంచిదని అడిగారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో పలువురు ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అప్పట్లో కొన్ని శ్మశాన వాటికలు మూతపడగా.. వాటిల్లో కొన్ని అప్‌గ్రేడ్ చేశారు. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దాదర్‌లోని శ్మశానవాటికను శుభ్రం చేశారు. అయితే సోదరుడి మరణంతో దుఃఖంలో ఉన్న JRD టాటాను ఓదార్చడానికి జంషెడ్ కంగా అక్కడికి వెళ్లినప్పుడు.. ముంబైలోని శ్మశానవాటికలో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని JRD టాటా చెప్పారు.

వర్లీలో శ్మశాన వాటికకు పునాది ఎలా పడిందంటే?

ముంబైలోని వర్లీలో ఉన్న శ్మశానవాటికలో చాలా స్థలం ఉంది. ఇది పార్సీలకు కూడా సౌకర్యంగా ఉండేది. వర్లీలోనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని జంషాద్ కంగా భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే ఆయన బదిలీ అయ్యారు. అప్పటికీ జంషెడ్ కంగా ఈ మిషన్‌ను వదిలిపెట్టలేదు. ముంబైలోని ప్రభావవంతమైన పార్సీల సహకారంతో.. వీరి అంత్యక్రియలకు ప్రత్యామ్నాయ పద్ధతిని కోరుతూ ‘డిస్పోజ్ ఆఫ్ ది డెడ్ విత్ డిగ్నిటీ’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పుడు జంషాద్ కంగా మాట్లాడుతూ- ‘టవర్ ఆఫ్ సైలెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు.. కనుక మాకు ప్రత్యామ్నాయం కావాలని కోరారు.

2015లో వర్లీలో శ్మశానవాటికను నిర్మించారు

జంషాద్ కంగా డిమాండ్ తో పార్సీల కోసం శ్మశాన వాటికను నిర్మించాలనే డిమాండ్ ఊపందుకుంది. టవర్ ఆఫ్ సైలెన్స్ సమీపంలో శ్మశానవాటికను నిర్మించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయ్తీ పార్సీల అతిపెద్ద ప్రతినిధి సంఘం.. బొంబాయి పార్సీ పంచాయితీ అంటే BPP దీనిని అంగీకరించలేదు. టవర్ ఆఫ్ సైలెన్స్ ద్వారా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపిన వారికి మాత్రమే అక్కడ నిర్మించిన ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేసేందుకు అనుమతించారు. అయితే పార్సీల మృతదేహాలను వేరే చోట పూడ్చిపెట్టిన లేదా దహనం చేసిన వారిని సైలెన్స్ టవర్ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. మిగిలిన చోట్ల, మృతదేహాలను పూడ్చిపెట్టిన, దహనం చేసిన ఇద్దరు పార్సీ పూజారులను కూడా తమ ప్రార్థనా మందిరాల్లో అడుగు పెట్టరాదంటూ నిషేధించారు. దీని తర్వాత 2015లో మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి పార్సీల సమూహం ముంబైలోని వర్లీలో పార్సీల కోసం శ్మశానవాటికను నిర్మించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!