Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (December 6, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయ గల స్థితిలో ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 6, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మీ సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలలో మీకు బాగా ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. కుటుంబపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి గురవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. ప్రేమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. మీ సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోవడం జరుగుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల చదువులు సానుకూలంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులుంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా బిజీ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సజావుగా చక్కబెడతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయక పోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక విషయాలకు రోజంతా అనుకూలంగా ఉంటుంది. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో బాగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎక్కువగా ఆధారపడ తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పనిభారం పెరిగినా ప్రతి ఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిదానంగా ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులతో ఇబ్బందిపడతారు. ఆర్థిక లావాదేవీలకు కొద్దిగా దూరంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.



